దోమలు పుట్టకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్
గరిడేపల్లి, జులై 22 (జనం సాక్షి): గరిడేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన మండల శానిటేషన్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ మొదలైనందున దోమల ద్వారా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా ఫైలేరియా మెదడువాపు వ్యాధులు వస్తాయి కావున దోమలు పుట్టకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామపంచాయతీ పరిధిలో డ్రైనేజీలు క్లియర్ గా ఉంచాలని మురికినీటి గుంటలు ఏమైనా ఉన్న ఎడల వాటిని పూడ్చి వేయాలని పూడ్చలేని మురికినీటి గుంటలో వారానికి ఒకసారి ఆయిల్ బాల్స్ వేయాలని అన్నారు.ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కార్తిక్,ఎంపీడీవో వనజ ,డాక్టర్ జగదీశ్వర్ హెచ్ఈఓ ఏ.రామకృష్ణ ,పిహెచ్ఎన్ జి.ప్రమీల,సూపర్వైజర్ యన్ అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area