దోమల నివారణకు యాక్షన్‌ప్లాన్‌

విశాఖపట్టణం,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): పరిసరాల పరిశుభ్రతతోనే రోగాలను నివారించవచ్చని జోనల్‌ కమిషనర్‌ బి.రాము తెలిపారు. దోమల నివారణకు నెల రోజుల యాక్షన్‌ఎ/-లాన్‌ రూపొందించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా 16 మంది కార్మికులతో నిర్థేశించిన ప్రాంతాల్లోని కాలువ పూడికతతలు చేస్తామని అన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే దోమలు ఎక్కువై రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. గవరపాలెంలో నమోదైన డెంగ్యూ వ్యాధికి ఆ ఇంటి ప్రాంతంలో నీరు నిల్వ ఉండడమే కారణంగా గుర్తించామన్నారు. ప్రయివైటు క్లినిక్‌లు జ్వరాలను డెంగ్యూగా చిత్రీకరిస్తూ రోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అటువంటిది డెంగ్యూ కింద పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు. కేవలం ఎన్‌టిఆర్‌ ఆసుపత్రి, కెజిహెచ్‌ ఆసుపత్రుల్లో నిర్థారణ చేస్తేనే డెంగ్యూగా పరిగణిస్తామన్నారు.

—-

 

తాజావార్తలు