‘ధనుష్’ ప్రయోగం విజయవం

అణు క్షిపణి ‘ధనుష్’ ప్రయోగం విజయవంతమైంది. ఒడిసా తీరం నుంచి ఎస్ఎఫ్‌సీ ఈ అణుబాణాన్ని విజయవంతంగా పరీక్షించింది. 350 కిలోమీటర్ల లక్ష్యాలను ధనుష్ ఛేదిస్తుంది. నావికాదళ రకమైన దేశీయ పృథ్వీకి మరో రూపమే ఈ ధనుష్! ‘‘సాయుధ దళాల సాధారణ ప్రయోగంలో భాగంగానే దీనిని ప్రయోగించాం. ధనుష్ తన లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది’’ అని డీఆర్డీవో ప్రకటించింది. ఇప్పటికే రక్షణ దళాల ఒరలో చేరింది. డీఆర్డీవో దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదు క్షిపణుల్లో ఇది కూడా ఒకటి! ధనుష్ సంప్రదాయ వార్ హెడ్‌తో పాటు 500 కిలోల అణు బాంబులను మోసుకెళ్లగలదు. సముద్రం, భూ ఉపరితల లక్ష్యాలను ఛేదించగలదు.