ధరణి పరిష్కారం చూపాలంటు బాదీతుల వృద్ధ దంపతుల ఆవేదన
రామారెడ్డి అక్టోబర్ 12 ( జనంసాక్షీ ) :
ధరణి పరిష్కారం చూపాలంటు వృద్ద దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి మోసాల విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య పత్రిక ముఖంగా మాట్లాడుతూ, రామారెడ్డి మండలం ఉప్పల్వా యి గ్రామానికి చెందిన చిలుక శంకర్ అనే వ్యక్తికి చెందిన పదిహేను గుంటల వ్యవసాయ భూమి ఉంది. అతనికి పట్టా పాస్ బుక్ పై సదాశివ నగర్ యూనియన్ బ్యాంకు రుణం లక్ష రూపాయలు తీసుకున్నారు. అతను కొద్ది రోజుల క్రితం ధరణిలో చెక్ చేసుకోగా అట్టి భూమి ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన మోత్కూరి సాయవ్వపై మార్పిడి చేసినట్టుగా ఉందన్నారు. దీంతో చూసి అతను భయభ్రాంతులకు గురై బుధవారం రామారెడ్డి మండల తహశీల్దార్ వద్దకు రావడం జరిగిందన్నారు.తహశీల్దార్ తో ధరణి లో జరుగుతున్న పేరు మార్పిడి, ( భూ ) దొంగల గురించి , తప్పిదాల పట్ల ప్రశ్నించడం జరిగింద న్నారు. డిజిటలైజేషన్ అంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా ( భు ) సమస్యలు, వివాదాలు , తప్పులు దొర్లుతూ అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. అధికార నాయకుల హస్తం భు వివాదాలను సృష్టిస్తే ఊరుకునేది లేదన్నారు. భు సమస్యల పరిష్కరం కాకపోవడం ఆత్మహత్యలకు దారితీసే విధంగా దాపురించిందని అన్నారు. ఎటువంటి తప్పిదాలు జరగకుండా చూడాలని తహశీల్దార్ ను కోరాడం జరిగిందన్నారు. భు దొంగల పని పట్టాలని పిలుపునిచ్చారు.