ధరణి వెబ్ సైట్ ద్వారా రైతులకు తీరని అన్యాయం

రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కాంగ్రెస్ కిసాన్ సెల్ యాచారం మండల అధ్యక్షుడు లిక్కి పాండు రంగారెడ్డి

రైతులకు సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-
ధరణి వెబ్ సైట్ ద్వారా రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని, ధరణి వెబ్ సైట్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ యాచారం మండల అధ్యక్షుడు లిక్కి పాండు రంగారెడ్డి   డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భేషరత్తుగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని అన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఎన్. విస్మరించిందని ఆరోపించారు. రైతులకు సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ధరణి పోర్టల్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు రెన్స్ ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ధరణి వెబ్ సైట్ ను రద్దు జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన వాగ్ధాలను నెరవేర్చాలని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ యంత్రంగాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు.