దిల్లీ: హ్యుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 16 నుంచి హ్యుందయ్ అన్ని మోడల్ కార్లపై దాదాపు రూ.15వేలు పెంచనున్నట్లు తెలిపింది. రూపాయి విలువ పడిపోవడంతో పాటు, ఉత్పాదక వ్యయం పెరుగుతున్నందున కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ధరల పెరుగుదల ఆయా మోడల్స్‌పై రూ.3వేల నుంచి రూ.15వేల వరకు ఉంటుందని హ్యుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ నెల 16 నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయన్నారు. మారుతి సుజుకి ఇటీవల కార్ల ధరలు దాదాపు రూ.20వేల దాకా పెంచుతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే హ్యుందయ్ కూడా ధరలు పెంచేసింది.