ధరూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన
– జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్…
గద్వాల రూరల్ జులై 20 (జనంసాక్షి):- పోలీస్ సిబ్బంది, అధికారులు విధుల పట్ల బాధ్యత తో వ్యవహరించి ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ అన్నారు…
వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ గారు ధరూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ రికార్డ్స్ ను, స్టేషన్ పరిసరాలను మరియు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను తనిఖీ చేశారు…అందులో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు . రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, మెన్ రెస్ట్ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. స్టేషన్ లో రోజు వారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ,సెంట్రీ రిలీఫ్ బుక్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్, సుపీరియర్ ఆఫీసర్స్ విసిటింగ్ బుక్స్, ఫైనల్ రిపోర్ట్స్ తదితర రికార్డ్స్ ను తనిఖీ చేశారు..పోలీస్ స్టేషన్లో నమోదయిన గ్రేవ్, నాన్ గ్రేవ్ సిడి ఫైల్స్ ను పరిశీలించి, పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని ఎస్సై శేఖర్ రెడ్డి కు సూచించారు…ఈ సందర్భంగా ఎస్పీ గారు స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నందు 5S ను ఎవరి పరిధిలో వారు నిత్యం అమలు అయ్యేటట్లు చూసుకోవాలని, డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలన్నారు, పాత నేరస్థుల ఫై నిఘా పెట్టాలని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి విపిఓ వ్యవస్థ ఎలా పని చేస్తున్నదని అడిగి తెలుసుకున్నారు, గ్రామ స్థాయిలో ఉన్న విలేజ్ పోలీస్ ఆఫీసర్ స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కలిగి యుండి, తరచుగా గ్రామాలను సందర్శిస్తూ, అక్కడి వారి సమస్యలు తెలుసుకుంటు వారి మౌలిక అవసరాలు పోలీసు శాఖ నుండి చేయవలసిన సహాయం పై పై అధికారులకు సమాచారం అందజేస్తూ సమాచార సేకరణ చేయాలి అని తెలిపారు. అలాగే పోలీసు సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. కమ్యూనిటీ పోలిసింగ్ మరియు ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానన్ని అమలు పరచాలని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞాణoను సద్వినియోగం చేసుకోవాలని , సిసిటిఎన్ అప్లికేషన్ ను నేర్చుకోవాలని, ఈ పెట్టి కేసులు, ఈ చాలన్స్ కేసులలో , ఫెసియేల్, ఫింగర్ ప్రింట్ లలో సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం కావున వీటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అధికారులు సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన, వృత్తిపట్ల నిబద్ధత, విధేయత, కలిగి ఉండాలని, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. ఫిర్యాదుదారులు బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, వృత్తిపట్ల అంకిత భావం కలిగి ఉండాలని సూచించారు. బాధ్యతలను నిర్వర్తించడంలో నిజాయితీ పారదర్శకత కలిగి ఉండాలని ఎస్పీ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో గద్వాల్ సి. ఐ చంద్రశేఖర్ గారు, ఎస్సై శేఖర్ రెడ్డి, సి సి లోహిత్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..
.
Attachments area