ధర్మపురి ఆలయంల చోరీ

ధర్మపురి : కరీంనగర్‌ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధనలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి  ఆలయంలోకి  ప్రవేశించిన దొంగలు ప్రధాన ఆలయం వద్ద రెండో హుండీని ధ్వంసం చేసి నడదును దోచు కెళ్లారు. సుమారు రూ. లక్ష వరకూ హుండీలో సొమ్ము ఉన్నట్లు ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ధర్మపురి సీఐ మహేందర్‌ ఆలయానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆలయంలోసరైన భద్రత లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.