ధర్మపురి గడ్డపై కాంగ్రెస్ సభ..
ధర్మపురి (జనం సాక్షి )జగిత్యాల జిల్లా ధర్మపురి లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన సభ లో శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, జువ్వాడి నర్సింగ రావు, వివేక్ వెంకట్ స్వామి తో కలిసి TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈసందర్భంగా రేవంత్ రెడ్డి
మాట్లాడుతూ,గత ఎన్నికల్లో కేసీఆర్ కుట్ర పూర్వకంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ను ఓడించారని ఆరోపించారు.గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో జరిగిన అభివృద్ధే తప్ప మరే అభివృద్ధి కి ధర్మపురి నోచుకోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారం లో ఉన్నా
గోదావరి నది పక్కన ఉన్నా ధర్మపురి లో తాగునీటి కి కట కట ఉందన్నారు.కేసీఆర్ సాగు నీటి ప్రాజెక్టు లలో దోచుకున్న డబ్బును ప్రజలకు పంచుతామన్నారు. ఇసుక మీద బ్యారేజ్ లు కట్టి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యాస్ సిలిండర్ ను 500ల రూపాయలకే అందచేస్తామన్నారు.
ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. పింఛన్ దారులకు నెలకు 4వేల పెన్షన్ ఇస్తామని.
గల్ప్ కార్మికులకు గల్ప్ సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు. రైతులకు 2 లక్షల రుణ మాఫి చేస్తామన్నారు. ప్రతి ఇంటి కి 200 యూనిట్ లఉచిత కరెంట్ ఇస్తామని, నిరుపేదలకు ఇంటి నిర్మాణం కు 5 లక్షలు మంజూరుచేస్తామన్నారు.
సభ లో రేవంత్ రెడ్డి అన్నారు.
గోదావరి క్రిష్ణా బేసిన్ లో పండిన వడ్లకి సరైన ధర గిట్టుబాటు ధర కలిపిస్తామని హామీ ఇచ్చారు