ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
జనంసాక్షి/చిగురుమామిడి-నవంబర్4:
చిగురుమామిడి మండల సింగిల్ విండో, ఐకెపి,డిసీఎంఎస్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో 20 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డిలు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాలకు 2060, బి గ్రేడ్ ధాన్యానికి 2040 రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిందని, కావున రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్మ వద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ కనీసం మద్దతు ధర పొందాలన్నారు, కొనుగోలు కేంద్రాల నిర్వహణ సమయంలో కేంద్రంలో నెలకొనే సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు, రైతుల కచ్చితంగా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈకార్యక్రమములో వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు సాంబారి కొమురయ్య, సర్పంచులు బెజ్జంకి లక్ష్మణ్, శ్రీమూర్తి రమేష్, నాగేల్లి వకుల లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ మెడబోయిన తిరుపతి, తహసిల్దార్ సయ్యద్ ముబీన్ అహ్మద్, ఎంపీడీవో నర్సయ్య, సబ్ ఇన్స్పెక్టర్ దాస సుధాకర్, ఐకెపి ఎపిఎం మట్టల సంపత్ కుమార్, మాజీ సింగిల్ విండో చైర్మన్ చిట్టమల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ పన్యాల భూపతిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ తాళ్లపల్లి తిరుపతి, గిరిధవర్ పూదరి రాజుగౌడ్, ఏఈఓ పరిధిద్దీన్, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు అకవరం మఠం శివప్రసాద్, వార్డు సభ్యులు వంతడుపుల దిలీప్ కుమార్, చల్పూరి విష్ణుమచారి, సర్వర్ పాషా, కూనచ్చుల మహేందర్, పోటు మల్లారెడ్డి, కొమ్ము కొమురయ్య, గందె సంపత్ కుమార్, గందే సంతోష్ కుమార్, గుండెకారి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.