ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి
కలెక్టర్ డాక్టర్ ఎ శరత్ ఆదేశం
జగిత్యాల,నవంబర్ 2(జనంసాక్షి): జిల్లాలో ధాన్యం కోనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, రైతులు దాన్యం తెచ్చిన తర్వాతనే ప్రారంభిస్తామని ఊరుకోకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలోని ఎంపిడిఓలతో ధాన్య సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్టాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారమిచ్చి చర్యలు చేపట్టాలన్నారు. గత రబీలో ఏర్పటు చేసిన 70-80శాతం కేంద్రాలు ఖరీఫ్‌లో దాన్య సేకరణకు ప్రారంభిస్తున్నామన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాలనన్నింటిని సోమవారం కల్లా ప్రారంభించి నివేదిక సమర్పించాలన్నారు. ధాన్యం కేంద్రాల్లో బ్యానర్ ఏర్పాటు చేయాలని, మద్దతు దర, తేమశాతం తదితర సమాచారం తెలుపుతూ ప్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రదర్శించాలన్నారు. గన్నీ బ్యాగులు తూకం మిషన్, టార్పాలిన్, తదితరాలు సిద్దం చేసుకోవాలన్నారు. మౌళిక వసతులకై చర్యలు తీసుకోవాలన్నారు. నీడ ఉండేలా చూడాలని కొనుగోలు కేంద్రం పరిధిలో పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి పనివిభజన చేసి బాద్యతలు అప్పగించాలన్నారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూంను ప్రారంభించనున్నట్లు కంట్రోల్ రూం నంబర్ అన్ని కేంద్రాల్లో ప్రదర్శిస్తామన్నారు. మొదట వచ్చిన వ్యక్తి మొదట ప్రాదాన్యతగానే కొనుగోల్లు జరుపాలన్నారు. గన్నీ బ్యాగులకోసం ముందస్తుగా సిద్దంగా ఉండాలన్నారు. పంచాయితీ కార్యదర్శిని ప్రక్రియలో బాగస్వామ్యం చేయాలన్నారు. తహశీల్దార్లు సహకరించాలన్నారు. తేమ విషయమై సమస్యలోస్తే పరిష్కరించాలన్నారు. దాన్యకొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిస్ట చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి రాజేశం, మెట్‌పల్లి సబ్‌కలెక్టర్ ముషార్రఫ్ పారూఖి, ఆర్డీఓ నరేందర్, తదితరులు పాల్గొన్నారు.