ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
కోటగిరి అక్టోబర్ 21 జనం సాక్షి:-కోటగిరి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలనీ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాధర్ దేశాయ్ ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.శుక్రవారం రోజున కోటగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ కోటగిరి మండలంలో వేల ఎకరాల లో రైతులు వరి ధాన్యాన్ని సాగుచేశారు.ప్రస్తుతం కోతలు మొదలై ధాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉందన్నారు.కానీ ప్రభు త్వం ఈ నెల 19 న కాటలను ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం దురదృష్టకరం అని అన్నారు
ఒకవైపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకా మరో వైపు అకాల వర్షాల కారణంగా ధాన్యం ముద్దయి, రంగు తెలుతుందని వారు వాపోయారు.ఇతర
రాష్ట్రాల వారు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయ డానికి ఇక్కడికి రాగా,ఇక్కడి రైస్మిల్లర్లు,వ్యాపారస్తు లు చెక్పోస్ట్ వద్దనే వారిని అడ్డుకోవడం దురదృష్ట కరమన్నారు.ఇకనైనా ప్రభుత్వం వరి ధాన్యపు కొను గోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాల ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్ర మంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్య దర్శి కొట్టం మనోహర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుసే న్,మాజీ ఎంపీపీ గంధపు పవన్,వహిధ్,తదితరులు పాల్గొన్నారు.