ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి
కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి)
జిల్లాలో వరి కోతలు మొదలై 20 రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. సోమ వారం నగరం లోనీ సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాణ్యత ప్రమాణాల పేరుతో ఇప్పటికే రైతాంగాన్ని అన్ని విధాల నష్టం చేస్తున్నారని ఆరోపించారు.ప్రతి ఏటా ధాన్యం కొనుగోలు సెంటర్లో అన్నదాతలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఐకేపీ సెంటర్లు ప్రారంభించకపోవడంతో ఇదే అదునుగా భావించిన కొందరు రైస్ మిల్లర్లు మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా కేవలం క్వి0టాల్ కు 1500 నుండి 1600 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని రైతు రక్తాన్ని జలగల్లా పిలుస్తున్న సదరు రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు వెంటనే కొనుగోలు సెంటర్లలో టార్పాలిన్లు టెంట్లు మంచి నీటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు నాణ్యత ప్రమాణాల పేరుతో 40 కిలోల దాన్యం బస్తాకు నాలుగు కిలోల నుండి 8 కిలోల వరకు కట్టింగులు గతంలో కోత పెట్టారని ఈసారి ఆలాంటి కొర్రీలు,కోతలు లేకుండా కొనుగోలు సజావుగా జరిగే విధంగా జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఐకెపి కొనుగోలు సెంటర్లు సహకార సంఘాలు,వ్యవసాయ మార్కెట్ల ద్వారా సెంటర్లను గుర్తించి రైస్ మిల్లులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్.నాయకులు మాతంగి శంకర్ అజయ్,రాయికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు