ధాన్యం దిగుబడి పెరిగింది

కొత్తగూడెం,జూన్‌26(జ‌నం సాక్షి): గత వేసవిలో సాగర్‌ జలాలు రైతులకు పుష్కలంగా అందటంతోపాటు అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయడంతో అధిక విస్తీర్ణంలో, ఆశించిన పంట దిగుబడి సాధ్యపడిందని జిల్లా వ్యవసాయ అధికారులు అన్నారు. సరైనన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ద్వారా రైతులు పండించిన ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. ఈ సీజన్‌లో లక్ష్యాన్ని మించి ధాన్యం దిగుబడి సాధించడం జరిగిందని అన్నారు. అధిక దిగుబడికి పచ్చిరొట్ట, సేంద్రియ ఎరువులు వాడాలని ఆమె రైతులకు సూచించారు. ఈ వ్యవసాయ సీజన్‌కు సంబంధించి తొలిసారిగా పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించామని అన్నారు.ఆధార్‌కార్డు, పహణీ పుస్తకం జిరాక్స్‌ ప్రతులను చూపి హెక్టారుకు 30 కిలోల చొప్పున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద జీలుగు విత్తనాలు పొందాల్సిందిగా రైతులకు సూచించారు.