ధాన్యం మిల్లింగ్ ను వేగవంతం చేయాలి
కలెక్టర్ జితేష్ వి పాటిల్
కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్11 (జనంసాక్షి);
ధాన్యం మిల్లింగ్ ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం రైస్ మిల్లుల యజమానులతో ధాన్యం మిల్లింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైస్ మిల్లుల యజమానులు రోజువారి లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. రోజుకు 464 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని పేర్కొన్నారు. నెల రోజుల్లో లక్ష్యాన్ని అధిగమించాలని కోరారు. రైస్ మిల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను జిల్లా కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ సన్మానించారు. పాలకవర్గం సభ్యులను అభినందించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఇన్చార్జి డిఎం వెంకటేశ్వరరావు, జిల్లా సివిల్ సప్లై అధికారి రాజశేఖర్, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగం, ప్రతినిధులు పాల్గొన్నారు.
Attachments area