ధీరులారా.. వందనం

4

అమరవీరులకు సీఎం నివాళులు

హైదరాబాద్‌,జూన్‌ 2(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. గన్‌ పార్క్‌ లో అమర వీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.తెలంగాణ కోసం అమరులు చేసిన త్యాగాలు చిరస్మరణీయం.. ప్రతి అమరుడి కుటుంబానికి రూ. పది లక్షల చొప్పున పరిహారం అందించాం. అవతరణ దినోత్సవం సందర్భంగా 598మంది అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నాం.  సీఎంతో పాటు స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి, మంత్రులు నాయిని, ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని, లక్ష్మారెడ్డి, ఎంపీ సుమన్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌ పార్క్‌ దగ్గర నివాళులు అర్పించారు.