రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామంలో పునర్నిర్మించిన పోచమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం ఉత్సవాలు మూడు రోజులుగా నిర్వహించనున్నారు. మంగళవారం నూతన విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఊరేగింపులో దేవతామూర్తులకు ఇంటింటా మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. సర్పంచి ఉదయశ్రీ, మాజీ సర్పంచ్ రాజు నాయక్, బి.యన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, ఉప సర్పంచి మూడేడ్ల గోవర్ధన్ రెడ్డి సహాయ సహకారాలు అందజేశారు. ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి ఆలయ నిర్మాణం కోసం తన సొంత భూమిని అందజేస్తూ ఆలయ నిర్మాణంలో అధికంగా నిధులు అందజేశారు. బుధవారం జరగనున్న విగ్రహ ప్రతిష్ట హోమం ప్రత్యేక పూజలకు స్థానిక శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల్లో నందివనపర్తి గ్రామం లో బ్యానర్ల కోలాహలంగా మారింది. ఆలయ ప్రారంభోత్సవం పురస్కరించుకొని గ్రామంలో రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రోడ్లన్నీ దీపాల వెలుగులతో విరాజిల్లుతుంది, ఆలయ కమిటీ సభ్యులకు నూతన ఉత్సాహాన్ని చంద్రశేఖరరెడ్డి రెడ్డి, రాజు నాయక్, గోవర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు తెలుగుమళ్ల అనిత రవీందర్, మూడో వార్డు సభ్యులు బండి ఉమారాణి అలెగ్జాండర్ ప్రోత్సహించారు. ఆలయ కమిటీ సభ్యులు మరాఠి యాదయ్య, చెట్టిమల్ల శాంతయ్య, గోరేటి సత్యనారాయణ,భూపతి దాసు, బండి ఈశ్వర్, తెలుగుమళ్ళ యాదయ్య, కాలే యాదయ్య, మరాఠీ గణేష్, భూపతి రామకృష్ణ, పెరమండ్ల బుగ్గ రాములు,చురుకైన పాత్ర పోషిస్తూ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.