నకిలీ విత్తనాలు అమ్మితే సమాచారం ఇవ్వాలి
ఆదిలాబాద్,మే2( జనం సాక్షి): గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది నకిలీ విత్తనాలు జిల్లాకు రాకుండా ముందస్తు చర్యలను చేపడుతున్నామని జిల్లా వ్యవసాయశాఖ అధికారిని ఆశకుమారి తెలిపారు. విత్తన దుకాణాల యజమానులు రైతులకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోవద్దని ప్రభుత్వం గుర్తింపు పొందిన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. ఎవరైనా బలవంతంగా ఒక విత్తన కంపెనీ కొంటే మరో కంపెనీకి చెందిన విత్తన బ్యాగు అంటగడితే వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. రైతులకు ఎలాంటి సహాయం కావాలన్నా జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా విత్తన దుకాణాల యజమానులు అనుమతి లేని కంపెనీల విత్తనాలను రైతులకు విక్రయిస్తే క్రిమినల్ కేసులతో పాటు శాఖా పరమై న చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాతస్టాక్, ఖరీద్ కోసం కొత్తగా వచ్చిన విత్తన కంపెనీలకు సంబంధించిన రిజిష్టర్లను పరిశీలించామని అన్నారు. గత ఏడాది కొన్ని నకిలీ బీటీ విత్తనాలు విత్త న దుకాణాల యజమానులు రైతులకు విక్రయించడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. పత్తి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు రాలేదని తెలిపారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా వ్యవసా య శాఖ అధికారులు విస్తృతంగా దాడులు చేస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్సును రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమో దు చేస్తామని వ్యాపారులకు హెచ్చరించారు. వ్యవసాయశాఖ అధికారులు ఎప్పుడైనా విత్తన దుకాణాలపై దాడులు చేస్తారని తెలిపారు.