నగరంలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్..

హైదరాబాద్ : నగరంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల లిస్టులో తమ పేరు లేదని, ఒక ప్రాంతంలో నివాసం ఉంటే మరో కేంద్రంలో ఓటు ఉందని కొంతమంది ఓటర్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లో 87,208 ఓటర్లున్నారు. నగర పరిధిలో 151 పోలీంగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వాహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా దేవిప్రసాద్, బీజేపీ తరపున ఎన్.రామచంద్రరావు, కాంగ్రెస్ తరపున ఎ.రవికుమార్ గుప్తలతో పాటు మొత్తం 31 మంది బరిలో నిలిచారు. పోటీ చేస్తున్న వారిలో 25 మంది స్వతంత్రులు.