నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా

నిజామాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి) : నగరంలో నిండుకుపోయిన మురుగు కాలువలను శుభ్రం చేసి, పేరుకపోయిన చెత్తను తొలగించి, సుందరంగా తీర్చిదిద్దడానికికార్యాచరణ ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌చోంగ్తూ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. మంగళ వారం స్థానిక నగరపాలకసంస్థ సమావేశమందిరంలో మున్సిపల్‌ అధికారు లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, తాను పర్యటించిన స్థలాల్లో కొన్నిచోట్ల చాలా బాగా, కొన్ని చోట్లమామూలుగా, మరికొన్ని చోట్ల అసహ్యంగా ఉందని తెలిపారు. ప్రజలతో మాట్లాడినప్పుడు మురుగు కాలువల ఏర్పాటుతో స్వచ్ఛమైన తాగునీరు ఇబ్బందులున్నాయని, చెత్తచెదారం శుభ్రం చేయడంలో సిబ్బంది అలసత్వం వహిస్తున్నారని, నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని ప్రజలు తెలిపారన్నారు. మురుగు కాలువలను శుభ్రం చేయడానికి, తీసిన చెత్తను తొలగించడానికి ప్రత్యేక కార్యక్రమం కింద 4 బ్లేడ్లను, 12 ట్రాక్టర్లను అద్దె ప్రాతిపదికన తీసుకొని నెలకొకసారి చొప్పున, చెత్త ఎక్కువ ఉండే గంజ్‌, కూరగాయల మార్కెట్‌ లాంటి ప్రదేశాల్లో 15 రోజులకొక్కసారి శుభ్రం చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థలో అధికారులతో కూడిన మంచి టీమ్‌ ఉందని, వీరు ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగివాటిని పరిష్కరించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఫిర్యాదులు వస్తూనే ఉంటాయని, వాటిని పరిష్కరించే బాధ్యత మనపై ఉందన్నారు. ఆర్‌అండ్‌బి జాతీయ రహాదారుల ఇరువైపుల మురుగు కాలువల నిర్మాణానికి బాధ్యత ఏ శాఖదో క్షుణ్ణంగా తెలుసుకొని కంఠేశ్వర్‌ గుడికి ఎదురుగా గల మసీదు వద్ద, ఇతర మురుగు కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ద్య పనులు నిర్వహించడానికి ఎంహెచ్‌వో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ ప్రకారం పనులు నిర్వహించా లన్నారు. నగరంలో చేపట్టవలసిన అన్నిపనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో వాటికి అనుమతి మంజూరు చేసి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. తాగునీరు, వీధిలైట్లు, మురుగు కాలువలు,కచ్చారోడ్లకు జాబితా సిద్ధం చేసుకొని అత్యవసరాన్ని గుర్తించి వెంట వెంట పనులు చేపట్టాలని ఆదేశిం చారు. నగరాభివృద్ధికి, సుందరీకరణకు అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా శ్రద్ధ చూపవలసిన అవసరం ఉందన్నారు. ఇండ్లల్లో చెత్తను ఎక్క డబడితే అక్కడ పడవేయకుండా ప్రజలకు అవగాహన కార్యక్ర మాలు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కమిషనర్‌ సిబ్బంది హాజరీ, పనితీ రుపై పర్యవేక్షణ చేయాలని తెలిపారు. సంబంధిత లైన్‌ డిపార్టుమెంటల్‌ అధి కారులు సంయుక్తంగా నగరంలో పర్యటించి చేపట్టవలసిన పనుల గురించి నివేదిక సిద్ధం చేయాలన్నారు. భూగర్భ డ్రైనేజీ 94 కోట్ల అంచనా కాగా ఇప్పటికే 55 కోట్ల రూపాయలు విడుదల చేయబడి 62 శాతం పనులు పూర్తి అయినాయని తెలిపారు. ఈసమావేశంలో అదనపు జేసీ శ్రీరాంరెడ్డి, మున్సి పల్‌ కమిషనర్‌ రామకృష్ణరావు, అదనపు కమిషనర్‌ మంగతాయరు, మున్సి పల్‌ ఇంజినీరు నాగేశ్వర్‌రావు, ఇఇపిహెచ్‌ రమణమూర్తి, ఎంహెచ్‌వో సిరాజుద్దిన్‌, తహశీల్ధార్‌ రాజేందర్‌, డిప్యూటీ ఈఈ రషీద్‌, ఇతర అధికారులు, సిబ్బంది, ఆర్‌అండ్‌బి అధికారులు, ట్రాన్స్‌కో ఎస్‌ఇ తదితరులు పాల్గొన్నారు.