నగర ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు

మేయర్ శ్రీమతి గుండు సుధారాణి

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 23(జనం సాక్షి)

 

వరంగల్ మహా నగర ప్ర‌జ‌లంద‌రికి నగర మేయర్ గుండు సుధారాణి దీపావ‌ళి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయకేతనంగా.. అవనికంతా ఆనంద విజయోత్సాహంగా.. అజ్ఞానపు చీకట్లను తొలగించి విజ్ఞాన దీపాలను వెలిగించే తేజోత్సవంగా జరుపుకునే పండగ దీపావళి అని, ఈ దీపావళి ప్రజల జీవితాల్లో మరింత సుఖ, సంతోషాలను వెదజెల్లి వెలుగులు ఇవ్వాలని ఆకాంక్షించారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి జరుగుతుండడంతో ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయని, అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోందని మేయర్ అన్నారు. ప్ర‌జ‌లంద‌రు పండుగ‌ను సంతోషంగా జ‌రుపుకోవాల‌ని, ట‌పాసులు కాల్చేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకొవాల‌ని మేయర్ సూచించారు.