నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాలు

కౌలురైతుల ఆందోళన

గుంటూరు,జూలై6(జ‌నం సాక్షి): నకిలీ, కల్తీ విత్తనాలను తయారుచేయటం, విక్రయించటం వంటి వాటికి తక్కువ జరిమానాలు, అతితక్కువ శిక్షలుండటంతో గ్రావిూణ ప్రాంతాల్లో నేరాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వీటిపై ఉన్నతాధికారులు ప్రత్యేకదృష్టి సారించాల్సి ఉంది. కొందరు రైతులకు ఆశచూపి మిగిలిన వారికి కొందరు వ్యాపారుల నకిలీ విత్తనాలను అందించటం కొన్నిచోట్ల జరుగుతుంది. దీంతో తాము విపరీతంగా నష్టపోయా మని కౌలు రైతులు వాపోతున్నారు.నికిలీ విక్రేతకు కూడా రైతులను మోసం చేయానలే బుద్ది రావడం దారుణమన్నారు. నకిలీ విత్తనాలపై రైతు సంఘాలు, ఆదర్శ రైతులు, అభ్యుదయ రైతుల నిఘా ఉంచి అధికారులకు సమాచారం అందించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉంటే అక్రమాలను అరికట్టవచ్చన్నారు. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. జాగ్రత్తలు పాటించక పోవటంతో నష్టపరిహారం కూడా దక్కకుండా పోయింది. నకిలీ

విత్తనాల బెడద తెలుగు రైతులను కుంగదీసింది. ప్రధానంగా మిరపరైతులు మోసపోయారు. ఖమ్మం,వరంగల్‌, గుంటూరు, ప్రకాశం జిల్లాలో మిరప సాగులో నకిలీ విత్తనాలు రైతులను నట్టేట ముంచాయి. కిలోకు రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చించి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేసిన రైతులు నకిలీలతో కోట్లలో నష్టపోయారు. కంపెనీ ప్రతినిధులు చెప్పిన మాటలు నమ్మి సాగుచేస్తే సర్వం కోల్పోయామంటూ వాపోతున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠినచర్యలు తీసుకుని పరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో గట్టి నిర్ణయాలు తీసుకోలేదు. బిలులు సక్రమంగా ఉంటే వ్యవసాయాధికారుల ద్వారా పరిహారం అందే పరిస్థితి లేనపుడు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. విత్తనాలు కొనుగోలుచేసినరసీదు, విత్తనాలు సంచి, లేబుళ్లు

అన్నీ ఉంటేనే పరిహారం పొందటం సులువుతోంది. మంచి పంటదిగుబడులు వస్తాయని నమ్మి రైతులు మోసోతున్నారు తప్ప వారి తప్పేవిూ లేదు. ప్రకృతి విలయాల సంర్భంలో పంటనష్టాలపై అంచనా ఏనాడూ సక్రమంగా సాగలేదు. పంటనష్టపోయిన రైతులకు అండగా ఉంటామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు. నకిలీ విత్తనాల కారణంగా పెట్టుబడి కూడా రాక మళ్లీ అప్పులే మిగులుతాయని ఆందోళన చెందుతున్నారు. వేలాది ఎకరాల్లో వరి, మిరప, పత్తి, తదితర పంటలు వేసిన రైతులు మునిగారు. వీరు ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదన్నారు. ప్రకృతి విలయానికి, ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అన్నదాతలు ఎల్లవేళాలా దగాపడుతూనే ఉన్నారు. పంటలు వేసుకుంటే ఆదరణ ఉండదు. పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలు రావు. పెట్టుబడులు పెట్టినా పంట చేతికొస్తుందన్న నమ్మకం ఉండదు. అన్ని కష్టాలను తట్టుకుని పంటలు పండిస్తే అన్నదాతలే వెన్నముక అంటారే గానీ ఆదుకున్న దాఖలాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని వాపోతున్నారు.