నయీం బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయండి
– ఐజీ నాగిరెడ్డి
హైదరాబాద్,ఆగస్టు 11(జనంసాక్షి): పోలీసుల ఎన్‌కౌంటర్లో మృతి చెందిన కరుడుగట్టిన నేరస్తుడు నయీం బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా సవిూపంలోని పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టాలని సిట్ ఐజీ నాగిరెడ్డి సూచించారు. బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. నయీం వ్యవహారంలో మొత్తం 12 కేసులు నమోదు చేశాం. రెండు ఏకే47లు, ఒక స్టెన్‌గన్, పలు తుపాకులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 599 ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. ఇప్పటి వరకు 18 మందిని ఈ వ్యవహారంలో అరెస్టు చేశాం. నయీం భార్యను అరెస్టు చేశామని తెలిపారు. వీలైనంత తొందరగా కేసును క్లియర్ చేస్తాం. మిర్యాలగూడలో 249 లాండ్ డాక్యుమెంట్లు, 75 ఫోన్లు, 40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తాజుద్దీన్ నుంచి 4.30 లక్షల నగదు, బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నాం. గోవాలో బిల్డింగ్ ఫర్హానా పేరుతో ఉంది. మనీ లాండరింగ్ జరిగిందేమో అన్న కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. ఆయుధాలు ఎలా వచ్చాయి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.