నరేంద్ర మోడీ “గో బ్యాక్” అంటూ ఎస్ఎఫ్ఐ బైంసా కమిటీ విద్యా భారతి జూనియర్ కళాశాలలో నిరసన.
జనం సాక్షి, బైంసారూరల్ : విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసిన నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టడం సిగ్గుచేటని ,తెలంగాణ లో నరేంద్ర మోడీ పర్యటనను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ బైంసా కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక విద్యా భారతి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది .ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ: సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం ఇచ్చిన మోడీ ఉన్న ఉద్యోగాలను తీసివేసి యువతను నిరుద్యోగులుగా మార్చారన్నారు .విద్యారంగానికి బడ్జెట్ కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్ యూనివర్శిటీలను మరియు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నారన్నారు . మోడీ ప్రధానమంత్రి అయ్యాక అంబానీ అదానీలు కుబేరులుగా మారారని , ప్రజలు మాత్రం నిరుద్యోగం పేదరికం తో మగ్గుతున్నారన్నారు . ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకువచ్చి విద్యార్థులపై రుద్దుతున్నారన్నారు .తక్షణమే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు .ఎప్పుడో ప్రారంభమైనా ఎరువుల ఫ్యాక్టరీని జాతీయం చేస్తానని చెబుతూ ఇప్పుడు తెలంగాణలో పర్యటించడం విడ్డూరంగా ఉందన్నారు .తక్షణమే విద్యార్థి యువజన వ్యతిరేక విధానాలను మోడీ మార్చుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి యువజనుల ఆగ్రహానికి గురి అవ్వక తప్పదని వారు హెచ్చరించారు . గో బ్యాక్ మోడీ అని పెద్దఎత్తున విద్యార్థులు నినదించారు .ఈ కార్యక్రమంలో జి అవినాష్, శివనాద్, సాయికుమార్, మహేష్,సౌజన్య
శిరీష,రమ తదితరులు పాల్గొన్నారు