నరేంద్ర మోడీ సభకు తరలి వెళ్తున్న బీజేపీ మెట్ పల్లి పట్టణ శాఖ
మెట్పల్లి టౌన్ ,నవంబర్ 12 ,
జనంసాక్షి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , 6210 కోట్లతో పునరుద్ధరించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి తెలంగాణ కి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సభకు పెద్ద ఎత్తున మెట్ పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు బయల్దేరడం జరిగింది. ఈ సంధర్బంగా పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్ మాట్లాడుతూ రైతులు క్యూ లైన్లలో ఎదురుచూడకుండా బ్లాక్ మార్కెట్ సమస్య లేకుండా,సబ్సిడీ ధరలకే యూరియా ని రైతులకు అందిస్తూ ఎరువుల కొరతను తీరుస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానిది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్, బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనికేల నవీన్, చెట్లపల్లీ సుఖేందర్ గౌడ్, బీజేవైయం జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట విజయ్, జిల్లా అధికార ప్రతినిధి బోడ్ల నరేష్, మద్దెల లావణ్య, కొయ్యల లక్ష్మణ్, బోడ్ల గౌతమ్, కుడుకల రఘు, కిషన్ మోర్చా పట్టణ అధ్యక్షులు జెట్టి రూపేష్ రాజు, కలికోట శ్రీకాంత్, కలలి రాజరెడ్డి, సుంకే అశోక్, బీమనతి విజయ్, మిట్టపల్లి శివ, సుతారి బుమరెడ్డి, బోడ్ల నర్సయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు