నరేంద్ర మోడీ సభకు తరలి వెళ్తున్న మెట్పల్లి మండల బిజెపి శ్రేణులు
మెట్పల్లి టౌన్ ,నవంబర్ 12,
జనం సాక్షి
రామగుండంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మెట్పల్లి మండల అధ్యక్షులు కొమ్ముల రాజుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా రాజ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి మేలు చేసే రామగుండం ఎరువుల కర్మగారాన్ని పునరుద్ధరించి దాదాపు రెండు దశాబ్దాల నుంచి మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 6210 కోట్లతో పునరుద్ధరించిన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ కి యావత్ రైతాంగ తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరించడం వలన తెలంగాణ రైతులకు ఇకముందు క్యూ లైన్ ఎరువుల కోసం బారులు తీరే అవసరం ఉండదని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ఎరువుల కొరత ఉండబోదని ప్లాట్ మార్కెట్ సమస్య ఉండదని కేంద్ర ప్రభుత్వం ఎరువులపై అందించే సబ్సిడీ ధరకే రైతులకు ఎరువులు లభ్యమయ్యే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల శ్రీనివాస్ గంట రాజేశ్వర్ పులి సంజీవ్ ఏపూరి రాజు రాపర్తి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు