నర్సంపేట అభివృద్ధిపై పేటెంట్ రైట్ ఉన్నది ఒక్క బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే

 

నియోజకవర్గ దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నా

ఇదే స్ఫూర్తితో మరోసారి నర్సంపేట గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయం

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

జనం సాక్షి,చెన్నరావుపేట

మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుక్షణం ఆలోచించే నాయకున్నీ నేననీ,స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలపైనా, అభివృద్ధి పైన నా ధ్యాసంతా అని ,ఈ నాలుగున్నర ఏండ్లలో నియోజకవర్గ ముఖచిత్రమే మారిపోయిందనీ, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాతే మన నియోజకవర్గానికి అత్యధికమైన నిధులు మంజూరయ్యాయనీ,నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిపై “పేటెంట్ రైట్స్” ఉన్నది ఒక్క బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే అని అన్నారు.చెన్నరావుపేట మండలానికి ఎస్సారెస్పీ డిబిఎం 40, 48 ద్వారా రెండు పంటలకు సమృద్ధిగా గోదావరి నీళ్లు అందించింది నేనే అని,
– చెన్నరావుపేట మండలంలోని అన్ని గ్రామాలకు తండాలను బిటి, సిసి రోడ్లు ఇచ్చింది ఒక్క బిఆర్ఎస్ పార్టీనే అని గతంలో పోటీచేసి గెలిచిన పాలకులు చెన్నరావుపేట మండల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనీ, రాబోయే ఎన్నికల్లో చెన్నరావుపేట మండలం నుండి అత్యధిక మెజారిటీ సాధించి తీరుతామనీ,డబుల్ బెడ్ రూమ్ లపై గత ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహించడం ద్వారా ఆనాడు నియోజకవర్గంలో ఇండ్లు నిర్మించలేకపోయామనీ, కార్యకర్తల అభివృద్ధి, సంక్షేమం కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనాలనీ,గతంలో గెలిచిన ఇద్దరు పాలకులు కాంట్రాక్టర్లుగా కేవలం కమిషన్ల్ కోసమే మాత్రమే పనిచేశారు. కానీ మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన నేను చెన్నరావుపేట మండలాన్ని గత పాలకుల కంటే మెండుగా అభివృద్ధి చేశానని, నియోజకవర్గ అభివృద్ధి కొరకు అద్భుతంగా కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పని తీరును గ్రౌండ్ లోకి తీసుకెళ్లాలి. పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరు ఐక్యమత్యంతో కృషి చేయాలనీ,ప్రతి పక్షాలకు నర్సంపేటలో చోటులేదు, గతంతో పోల్చితే ప్రతీ గ్రామంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు అసలు పట్టింపే లేని పల్లెలు నేడు కేసీఆర్ పాలనలో పచ్చదనం, పారిశుద్ధ్యంతో కళకళలాడుతున్నాయి.ప్రతిపక్షాల చౌకబారు విమర్శలకు, అసత్య ప్రచారాలకు ఎక్కడా కృంగిపోకుండా మనం చేసిన ప్రగతి చూపుతో వారికి సమాధానం చెబుదాం.సుదీర్ఘ కాలపు కల, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సాధించిన పార్టీగా మనమంతా గర్వించాలి.మీ ఐక్యత, ఆశీస్సులు ఉన్నంతకాలం మన పార్టీకి తిరుగు లేదు.ఇదే స్ఫూర్తితో మరోసారి నర్సంపేట గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయం.ఇదే రెట్టింపు ఉత్సాహంతో పార్టీ బలోపేతం కొరకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు.ఈ సమావేశంలో మండల పార్టీ కన్వీనర్ కంది క్రిష్ణా రెడ్డి, జెడ్పి కోఆప్షన్ సభ్యులు రఫీ, పార్టీ ముఖ్య నాయకులు, జెడ్పిటిసి పత్తి నాయక్, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, క్లస్టర్ భాద్యులు, పిఎసిఎస్ చైర్మన్లు, మాజీ ఎంపిపి,జెడ్పిటిసి,ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు