నర్సరీల్లో మొక్కల రక్షణ చర్యలు చేపట్టాలి
కామారెడ్డి,మార్చి29(జనంసాక్షి): వచ్చే హరితహారం కోసం నర్సరీల్లో పెంచుతున్న మొక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండిపోకుండా చూసుకోవాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని, గ్రీన్ షెడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఉపాధి హావిూ పనుల ద్వారా జలవనరుల పెరుగుదలకు చర్యలు చేపడుతున్నామని, ఇందులో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. రెండు సంవత్సరాల్లో 20 విూటర్ల లోతు నుంచి 15 విూటర్ల వరకు జలాలు పెరిగాయని, దక్షిణాది రాష్ట్రాల్లో కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. జిల్లాలో సోక్‌పిట్స్, ఫాంపాండ్స్, అటవీ ప్రాంతాల్లో కాంటూరు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు.