నలుగురు కార్మికులను మింగిన మ్యాన్‌హోల్
హైదరాబాద్,ఆగస్టు 13(జనంసాక్షి): మాదాపూర్ లో విషాద ఘటన జరిగింది. అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డులో మ్యాన్ ¬ల్ శుభ్రం చేసేందుకు దిగిన నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు, స్థానికుడు చనిపోయారు. వారిని కాపాడేందుకు వెళ్లిన 108 అంబులెన్స్ ఉద్యోగి చందు అస్వస్థుడయ్యాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. మృతులు తార్నాకలోని మాణికేశ్వర్ నగర్ కు చెందిన శ్రీనివాస్, సత్యనారాయణ, నగేష్ లుగా గుర్తించారు. మ్యాన్ ¬ల్ లో కార్మికులను కాపాడటానికి వెళ్లిన స్థానికుడు గంగాధర్ కూడా చనిపోయాడు. నాలుగు మృతదేహాలను వెలికితీశారు. మ్యాన్ ¬ల్ లో గ్యాస్ వల్లనే ఊపిరాడక చనిపోయినట్టు భావిస్తున్నారు.ఘటన సమాచారం తెలియగానే హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. మ్యాన్¬ల్ లోతు ఎక్కువగా ఉండడంతో పాటు విషవాయువుల కారణంగా మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.మృతుల వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.