నల్గొండ జిల్లాలో గవర్నర్‌ పర్యటన-ఫ్లోరైడ్‌ రహిత నీటిని అందించేందుకు కృషి

నల్గొండ:అల్లాపురం గ్రామంలో స్వచ్చంధసంస్థ ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్‌ను పరిశీలించారు. ఫ్లోరైడ్‌ రహిత నీటిని అందించే ఈ ప్లాంట్‌ను అందరు వినియోగించాలని సూచించారు. అక్కడినుంచి మందోళ్లగూడెం వెళ్తుండగా మహిలలు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. గ్రామంలో తాగునీటి ఇబ్బందిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌ ముక్తేశ్వరరావుకు సూచించారు. మందోళ్ల కేంద్రియ భూ పరిశోధన సంస్థను సంధర్శించి అక్కడి శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. భూగర్భ జలాలు ఎంత లోతులో ఉన్నాయో అడిగటి తెలుసు కున్నారు. జిల్లాలో అన్ని గ్రామాలకు ఫ్లోరైడ్‌ రహిత నీటిని సరఫరా చేసుందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

తాజావార్తలు