నల్లధనంపై చట్టబద్ధంగా వ్యవహరిస్తాం..అరుణ్‌జైట్లీ

4

న్యూఢిల్లీ,ఫిబ్రవరి9(జనంసాక్షి): నల్లధనం కేసులో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. దీనిని తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం కఠినంగానే ఉందన్నారు. బ్లాక్‌మనీపై దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం స్పీడ్‌ పెంచింది. స్విట్జర్లాండ్‌ సహకారంతో ఆదేశ బ్యాంకుల్లో ఖాతాలున్న 620 మంది భారతీయులకు సంబంధించి జాబితాను సుప్రీంకోర్టుకు అందజేసిన కేంద్రం, తాజాగా విదేశీ బ్యాంకుల్లో బ్లాక్‌ మనీ పోగేసుకున్న 60 మంది వ్యాపారవేత్తలపై దర్యాప్తుకు శ్రీకారం చుట్టింది. వీళ్లలో చాలామంది కార్పొరేట్స్‌, పారిశ్రామిక వేత్తలతోపాటు మరికొందరున్నట్టు తెలుస్తోంది. వీళ్ల ఖాతాల్లో దాదాపు 1500 నుంచి 1600 కోట్లకు పైగా సొమ్ములున్నట్లు గుర్తించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై మరింత సమాచారం రాబట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. నల్లధనం కేసులో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. దీనిని తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం కఠినంగానే ఉందన్నారు. సోమవారం  ఢిల్లీలో అరుణ్‌జైట్లీ విూడియాతో మాట్లాడుతూ . 350 మంది ఖాతాల మదింపు పూర్తి చేశామని తెలిపారు. మిగతా ఖాతాల మదింపును మార్చి 31లోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. స్విస్‌ అధికారులతో మాట్లాడేందుకు అక్టోబర్‌లోనే బృందాన్ని పంపామని గుర్తు చేశారు.  నల్లధనం కేసుల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని  అరుణ్‌జైట్లీ తెలిపారు. నల్లధనానికి సంబంధించి 350 మంది ఖాతాల మదింపు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా ఖాతాల మదింపును మార్చి 31లోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. స్విస్‌ అధికారులతో మాట్లాడేందుకు అక్టోబర్‌లోనే బృందాన్ని పంపినట్లు చెప్పారు. నల్లధనం కేసుల వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జైట్లీ  స్పష్టం చేశారు. మిగతా ఖాతాల మదింపు మార్చిలోగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అలాగే  స్విస్‌ అధికారులతో మాట్లాడేందుకు ఓ బృందాన్ని అక్టోబర్లోనే పంపినట్లు జైట్లీ తెలిపారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఆరు, ఏడు నెలలుగా చర్యలు తీసుకుంటోందన్నారు. కాగా  విదేశీ బ్యాంకుల్లో బ్లాక్‌ మనీ పోగేసుకున్న 60 మందిపై దర్యాప్తు ప్రారంభించనుంది. వీరి ఖాతాల్లో రూ.1,500 కోట్లకు పైగా సొమ్ము ఉన్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం. గత అక్టోబర్‌లో 627 మంది నల్ల కుబేరుల పేర్లతో కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని ఇండియాకు రప్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కమలనాధులు ప్రచారం చేసిన విషయం తెల్సిందే! అన్నట్టుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. దాదాపు ఆరునెలలు గడుస్తున్నా, నల్లధనం అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ విపక్షాలు ఆరోపణలు తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఓ అడుగు ముందుకేసిందని రాజకీయ నేతలంటున్నారు.