నల్లధనాన్ని వెనక్కు తెస్తాం

5

మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యంతో డిజిటల్‌ ఇండియాను నెలకొల్పుతా

దీన్‌దయాళ్‌ను ఆదర్శంగా తీసుకుంటాం

పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి23(జనంసాక్షి): ఉపాధి కల్పన నుంచి సంపద సృష్టి వరకు ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉంటుందని రాష్ట్రపతి ప్రణబ్‌  వెల్లడించారు. ఏకాత్మత, మానవతాదృక్పథం అన్న దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఆదర్శాల ఆధారంగా అభివృద్ధికి బాటలు వేయనున్నట్లు చెప్పారు. జన్‌ధన్‌ యోజనలో భాగంగా దేశవ్యాప్తంగా 13.2 కోట్ల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి… జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.11వేల కోట్లు జమయ్యిందని వివరించారు. అభివృద్ధి అన్నది వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సాగాలి, సమిష్టి కృషితోనే అద్భుత ఫలితాలు సాధ్యమని ఈ ప్రభుత్వం నమ్ముతుందన్నారు. పార్లమెంట్‌ బ్జడెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు.  గడచిన 9 నెలల్లో ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే సమగ్ర కార్యాచరణ ప్రారంభించినట్లు వెల్లడించారు. బ్జడెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో ఉభయ సభల నుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగించారు.అయితే  ప్రణబ్‌ చేసిన ప్రసంగంలో ఎపి ,తెలంగాణలకు సంబందించిన ఊసే లేదు.దీనిపై విమర్శలు వస్తున్నాయి.ఎపికి సంబందించి ప్రత్యేక ¬దా ,ఇతర ప్యాకేజీలకు సంబందించి ప్రస్తావన ఏమైనా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎఐసిసి అదినేత్రి సోనియాగాందీ ఈ విషయమై లేఖ రాశారు. అలాగే కొత్త రాష్ట్రం అయిన తెలంగాణకు సంబందించి పరిణామాల గురించి కూడా రాష్ట్రపతి ప్రసంగంలో ఒక్క ముక్క కూడా లేదు. ఆందప్రదేశ్‌ విషయాలేవీ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇక బడిలేని వూరు, చదువులేని బాలలు ఉండకూడదన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తెలిపారు. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చేందుకు మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు. ప్రభుత్వ తీసుకున్న చర్యల వల్ల ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో తగ్గిందన్నారు.  డిజిటల్‌ ఇండియా ప్రధాన లక్ష్యం సాంకేతిక పరివర్తన, అభివృద్ధి అన్నారు.  మిషన్‌ ఇంద్రధనుష్‌ ద్వారా కొత్త ఇమ్యునైజేషన్‌ వ్యాక్సిన్లకు ఆమోదం తెలిపామన్నారు.  ప్రతి వ్యక్తి సమగ్రాభివృద్ధి మా ప్రాధాన్యతాంశం అన్నారు. న్యాయ సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజలను భాగస్వాములను చేస్తామని ప్రకటించారు.  నల్లధనం కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని,  జన్‌ధన్‌ యోజన ఓ గొప్ప ఆలోచన, దాని అమలు తీరు ప్రశంసనీయమన్నారు. నీటి సమస్యను అధిగమించేందుకు ప్రధాన మంత్రి నీటిపారుదల పథకం ప్రవేశపెడుతున్నాం. రైతు సంక్షేమం కోసం వ్యవసాయం, మార్కెటింగ్‌లో విలువల పెంపు, బేటీ బచావ్‌-బేటీ పడావ్‌ ద్వారా బాలికల సంరక్షణ వంటి కార్యక్రమాలను తీసుకుని వెళతామన్నారు.  ప్రభుత్వ నిర్ణయాల్లో జాప్యం లేకుండా అధికార వికేంద్రీకరణ ద్వారా సత్వర నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. అంతర్జాతీయంగా నల్లధనం నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం.. అధికార వికేంద్రీకరణ ద్వారా సత్వర నిర్ణయాలు తీసుకుంటామన్నారు. భారత్‌ చదువుతోంది, భారత్‌ ఎదుగుతోంది అంటూ పఢేగీ భారత్‌, బడేగీ భారత్‌ ప్రారంభిచామని పేర్కొన్నారు. పన్నుల విధానాన్ని సరళీకరిస్తామని తెలిపారు. బీమారంగంలో ఎఫ్‌డీఐలకు 49 శాతానికి పెంచామని చెప్పారు. ఎలక్టాన్రిక్‌  ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యతను ఇస్తున్నామని వెల్లడించారు. సమర్థపాలన కోసం టెక్నాలజీని వాడుకుంటున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు.  వ్యవసాయంలో ఉత్పాదకత పెంచేందుకు భూసార పరీక్షలు, కార్డులు , 2022 నాటికి దేశంలోని పేదలందరికీ ఇళ్లునిర్మించడం తమ ప్రాధామ్యాల్లో ఉందన్నారు.  స్వచ్ఛత అన్నది మా ప్రభుత్వ విధానం, విశ్వాసం అన్నారు.  భూమి కోల్పోయిన రైతులు నష్టపోకుండా తగిన ఉపాధి కల్పిస్తాంమని,  భూమిలేని కౌలురైతులకు వ్యవసాయం గిట్టుబాటు కల్పించేందుకు కృషిచేస్తామని అన్నారు.  అన్నదాత సుఖీభవ అనేది ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పేర్కొన్నారు.  రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రైతులకు భూ ఆరోగ్య కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. బిందు, తుంపర సేద్యం, గ్రీన్‌ హౌస్‌లకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. భూమిలేని కౌలు రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేందుకు కృషి చేస్తామన్నారు. భూమి కోల్పోయిన రైతు నష్టపోకుండా తగిన ఉపాధి కల్పిస్తామన్నారు. త్వరలో ప్రధానమంత్రి ఇరిగేషన్‌ పథకం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధిపై రాష్టాల్ర మధ్య సానుకూల పోటీ ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా బడి లేని ఊరు, చదువు లేని పిల్లలు ఉండకూడదన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ స్పష్టం చేశారు. ఈశాన్య రాష్టాల్ల్రో విద్యాభివృద్ధికి ఈశాన్య వికాస పథకం కింద విద్యాసంస్థలను నెలకొల్పుతామని చెప్పారు. నైపుణ్యాల అభివృద్ధి ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సకాలంలో ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గిరిజనుల అభివృద్ధికి వనబంధు కళ్యాణయోజన పథకం ప్రవేశపెడుతాం. ఉద్యోగావకాశాల కల్పనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. న్యాయసంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. 35 పథకాలను నగదు బదిలీ కిందకు తీసుకొస్తామని చెప్పారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించారు. జన్‌ధన్‌ యోజన ఓ గొప్ప ఆలోచన, దాని అమలు తీరు ప్రశంసనీయమని వెల్లడించారు. గ్రావిూణ భారతంలో ఉద్యోగిత పెరిగేందుకు ఆహార శుద్ధి రంగం అద్భుత అవకాశమన్నారు. యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో విస్తృత రీతిలో నైపుణ్యాభివృద్ధి సాధించాలన్నారు. ఈశాన్య రాషాల్లో విద్యాభివృద్ధికి ఈశాన్య వికాస పథకం కింద విద్యాసంస్థల ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే  అన్నదాత సుఖీభవ అనేది ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం అన్నారు.  ఎంపీలు తమ అభివృద్ధి నిధుల్లో 50శాతం స్వచ్ఛభారత్‌ కోసం వెచ్చించాలని సూచింఆరు. నైపుణ్య భారతం అనేది ప్రభుత్వం తీసుకున్న బృహత్తర లక్ష్యాల్లో ఒకటన్నారు.  మహిళల భద్రత కోసం ‘హిమ్మత్‌’ యాప్‌ ప్రవేశపెట్టామన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ దూసుకెళ్తోంది అని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చేందుకే మేక్‌ ఇన్‌ ఇండియా. నౌకాయనం, సముద్రతీర ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. డిజిటల్‌ ఇండియా ప్రధాన లక్ష్యం సాంకేతిక పరివర్తన, అభివృద్ధి. స్మార్ట్‌ సిటీ కార్యక్రమానికి త్వరలో జాతీయ పట్టణాభివృద్ధి మిషన్‌. మిషన్‌ ఇంద్ర ధనుష్‌ ద్వారా కొత్త ఇమ్యునైజేషన్‌ కార్యక్రమానికి ఆమోదం. 184 జిల్లాల్లో కొత్త ఇమ్యునైజేషన్‌ కార్యక్రమం అమలు జరుగుతోందన్నారు.  అప్రెంటీస్‌ ప్రోత్సాహ్‌ యోజన ద్వారా సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు. సుకన్య సమృద్ధి పేరిట బాలికల కోసం ప్రత్యేక పొదుపు పథకం.ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సకాలంలో ఉపకరా వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నల్లధనం కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు. ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, ప్రధాని నరేంద్రమోదీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లిఖార్జునఖర్గే, కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు.