నవంబర్ 2న ధర్మ పురిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కొనసాగుతున్న ఏర్పాట్లు
50 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం
సీ ఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
====
ధర్మపురి( జనం సాక్షి)ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 2 న బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి దాదాపు 50 వేల మందికి పైగా సభకు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చే బీఆర్‌ఎస్ శ్రేణులకు ఇక్కట్లు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం సభకు పెద్దఎత్తున జనాన్ని తరలించేందుకు నాయకులు సిద్ధమ వుతున్నారు. బహిరంగ సభా వేదిక ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం వారం నాడు పరిశీలించారు. సభకు వచ్చే ప్రజా నీకానికి ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.