నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే వారికి పోలీసు శాఖ హెచ్చరిక
పినపాక నియోజకవర్గం ఆగష్టు 26 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ళ బయ్యరం పోలీస్ వారి హెచ్చరిక మండలంలో జరగబోయే వినాయక చవితి సందర్భంగా వివిధ గ్రామల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించదలచినవారు ముందస్తుగా కమిటీ ఏర్పాటు చేసుకోవాలసిన ముఖ్యమైన అంశాలను పోలీస్ శాఖ నిబంధనలను జారీ చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే వారు ఆన్లైన్లో అప్లికేషన్ పొందాలని సూచించారు. ఉత్సవాలు నిర్వహించే కమిటీ వారిదే పూర్తి బాధ్యత వహించాలి. విగ్రహాల ఏర్పాటుకు మున్సిపాలిటీ, పంచాయతీ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. విద్యుత్ కలెక్షన్ల నిమిత్తం విద్యుత్ సంస్థ నుండి అనుమతి తప్పనిసరిగా పొందాలి. గ్రామాలలో వివిధ కూడల్లో ఏర్పాటు చేసిన మండపాలకు పోలీస్ వారికి తప్పనిసరిగా తెలియజేయాలి. మైకులు ఏర్పాటుకు మీసేవ పోలీసు వారి అనుమతి తప్పనిసరి
డిజె సౌండ్ అనుమతి లేదు అదే విధముగా గణేష్ మండపాల వద్ద రోడ్లు అంతరాయం ఏర్పడకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి గొడవలు అన్నలకు పాల్పడకుండా ప్రశాంతమైన వాతావరణం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే మండపాల వద్ద రాత్రి వేళలు ఇద్దరు వాలంటీర్లను నియమించాలని తెలిపారు.