నవీపేట బస్టాండ్‌లో దుర్గంధం

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకి రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. బస్టాండ్‌ భవనం పైపెచ్చులు ఊడి ప్రయాణికులపై పడడంతో గాయలపాలవుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో మురికి నీరు నిలిచి ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తున్నది. మహిళా ప్రయాణికుల మురుగుదొడ్డి నిర్వహణ సౌకర్యవంతంగా లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ప్రయాణికులు రద్దీ పెరుగుతుండడంతో వసతులు కల్పిచాలని కోరుతున్నారు. ప్రయాణ ప్రాంగణంలోని సమస్యలపట్ల నవీపేట మండల అధికార, ప్రతిపక్ష నాయకులు చిన్నచూపు చూస్తుండడంతో అభివద్ధి కుంటుపడుతున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా రాజకీయ డ్రామాలు పక్కన పెట్టి ప్రయాణప్రాంగణం అభివద్ధి పట్ల శ్రద్ధ చూపాలని కోరుతున్నారు. నవీపేట ప్రయాణప్రాంగణంలో నెలకొన్న సమస్యలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉన్నతాధికారులకు నివేదించామని ప్రయాణ ప్రాంగణ కంట్రోలర్‌ గంగారాం తెలిపారు. పై పెచ్చులు ఊడి పడడంతో ప్రయాణికులు ఎవ్వరు ఎª`లాట్‌ఫారమ్‌పైకి రాకుండా ముళ్ల కంచెలు అడ్డు వేసినట్లు అయన చెప్పారు. ఇటీవల హరితహారంలో భాగంగా ఆవరణలో మొక్కలు నాటినట్లు తెలిపారు. సమస్యలను తొందరగా పరిష్కరించి బస్టాండ్‌ను సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు.