నవ్యాంధ్ర పెట్టుబడులకు అనుకూలం

– సాంకేతికతలో అమరావతి ముందంజలో ఉండాలనేదే తన అభిలాష
– సీఎం చంద్రబాబు నాయుడు
– ఎలక్టాన్రిక్స్‌ కంపెనీ ఇన్‌వెకాస్‌ సంస్థను ప్రారంభించిన సీఎం
అమరావతి, జూన్‌29(జనం సాక్షి) : నవ్యాంధ్ర పెట్టుబడులకు అనుకూలమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధప్రదేశ్‌లో మరో అతిపెద్ద ఎలక్టాన్రిక్స్‌ కంపెనీ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. సెవిూ కండక్టర్ల తయారీలో పేరుగాంచిన ఎలక్టాన్రిక్స్‌ కంపెనీ ఇన్‌వెకాస్‌ సంస్థను గుంటూరులోని విద్యానగర్‌లో  సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడులకు నవ్యాంధ్ర అనుకూలమని అన్నారు. టెక్నాలజీ రోజురోజుకు విస్తరిస్తోందని, ఎండలు ఎప్పుడు వస్తాయో, వర్షాలు, పిడుగులు ఎప్పుడు పడతాయో.. ఏయే ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందో తదితర సమాచారాన్ని తెలుసుకొనే వెసులుబాటు టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చేసిందన్నారు. అంతేకాకుండా ఇంటర్నెట్‌ వచ్చాక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని తెలిపారు. సాంకేతికతలో అమరావతి ముందంజలో ఉండాలనేదే తన అభిలాష అన్నారు. నాలెడ్జ్‌ ఎకానవిూలో పిల్లలకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఏపీలో తొలిసారి సెవిూకండక్టర్ల తయారీ సహా శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పనున్నారు. సెవిూకండక్టర్లను ఇన్‌వెకాస్‌ సంస్థ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. బెంగళూరు, అమెరికా పర్యటనల్లో పలుమార్లు మంత్రి నారా లోకేశ్‌ ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుడులు పెట్టేందుకు ఆయన ఆ సంస్థను ఒప్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌, ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
ఆశా వర్కర్లకు సీఎం వరాలు..
రాష్ట్రస్థాయిలో ఆరోగ్య సూచికల్లో ఆశా వర్కర్లది కీలక పాత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి ప్రజాదర్బార్‌హాలులో ఆయన శుక్రవారం ఆశా వర్కర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి వరాలు కురిపించారు. నెలకు కనీస వేతనం రూ.3వేలు తప్పనిసరి చేస్తున్నట్టు చెప్పిన సీఎం.. వారికి స్మార్ట్‌ఫోన్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే, వారికి నెలకు రూ.6వేలు నుంచి 8వేలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. ప్రజల్లో పౌష్టికాహారం, పరిశుభ్రతపై నిత్యం అవగాహన కల్పిస్తున్నారని, రోజు రోజుకు జీవన ప్రమాణాలు పెరగాలని సూచించారు. ఆనందం, ఆరోగ్యం పెరిగి ప్రపంచంలో పదో స్థానంలో నిలవాలని ఆకాంక్షించిన చంద్రబాబు అందుకనుగుణంగా ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని వారికి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశావర్కర్లంతా ఆదర్శంగా నిలవాలని కోరారు.