నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ గ్రామంలో నూతన మత్స్య సహాకార సంఘం కమ్యూనిటీ హాల్ భవనం భూమి పూజ
ముఖ్య అతిథిగా డాక్టర్.కూచ్చుకుళ్ళ రాజేశ్వర్ రెడ్డి,
జడ్పీటీసీ శ్రీశైలం యాదవ్,
మండల అధ్యక్షుడు గూళ్ళ.హరికృష్ణ…..
నాగర్ కర్నూల్ రూరల్ డిసెంబర్ 18(జనంసాక్షి) నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ గ్రామంలో మత్స్య సహాకార సంఘం నూతన కమ్యూనిటీ హాల్ భవనం భూమి పూజ కార్యక్రమాని నిర్వహించారు.ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్.కూచ్చుకుళ్ళ.రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,మత్స్యకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కమ్యూనిటీ హాల్ కీ భూకేటాయించిన దాతలు మాజీ ఎంపిటిసి రమణ రావు 2గుంటల భూమి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఆనందంగా ఉంది.మన మత్స్యకారులందరికీ నేను ఎమ్మెల్సీ తనయుడుగా భవన నిర్మాణానికి 10లక్షల రూపాయలు ఎమ్మెల్సీ నిధులనుంచి మంజూరు చెప్పిస్తాను అని హామీ ఇచ్చారు.గంగమ్మ తల్లినీ నమ్ముకోని బ్రతుకుతున్న మీకు ఎల్లపుడూ మా సహాయం సహకారాలు అందిస్తామని తెలిపారు.మత్స్యకారులు ఐక్యతతో ముందుకు సాగాలి అని సూచించారు.జడ్పీటీసీ శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ,మత్స్య కారులకీ వెన్ను దన్నుగా ఉన్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ఎమ్మెల్యే మర్రి.జనార్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు జడ్పీ ఫండ్ నుంచి ఐదు లక్షల రూపాయలను.ఎమ్మెల్యే మర్రి.జనార్ధన్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.మండల అధ్యక్షుడు గూళ్ళ.హరికృష్ణ మాట్లాడుతూ,మత్స్యకారులందరికీ తన యొక్క సొంత భూమి దానం చేసిన మాజీ ఎంపిటిసి రమణరావుకీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.చెరువు కుంటల పై జీవనం కోనసాగిస్తున్న మేము మత్స్య కారులు మాట ఇస్తే మాట తప్పని వారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ కీ ఆలోచన విధివిధానాలతో ఆర్థికంగా మత్స్య కారులు బాగుపడాలి అని,ఉచిత చేప పిల్లల పంపిణీ,సబ్సిడీ వాహనాల ను,ప్రమాదవశాత్తు మరణిస్తే ఆరు లక్షల నష్టపరిహారం అందజేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా మత్స్య కారులు రుణపడి ఉంటాం అని సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కృష్ణయ్య,గ్రామ మత్స్య సహాకర సంఘం అధ్యక్షుడు కేతపల్లి.రాము,పర్వతాలు,అలీ, నాగర్ కర్నూల్ మండల ఉపాధ్యక్షుడు కొరుపాల.చంద్రశేఖర్,మండల ప్రధాన కార్యదర్శి ఎర్రవోలు మహేష్,మండల ప్రచార కార్యదర్శి కొండమోని.భీమయ్య మండల కార్యవర్గ సభ్యులు చెన్నమోని సత్యం,ఎడ్ల.ఆంజనేయులు,సొప్పరి. కుమార్,గ్రామ వార్డ్ మెంబర్ లు,మత్స్య కారులు పాల్గొన్నారు.