నాటి పోరాట యోధుల పోరాట ఫలితమే నేటి మన స్వేచ్ఛ స్వాతంత్ర్యము
గరిడేపల్లి, ఆగస్టు 11 (జనం సాక్షి): మన దేశ స్వాతంత్ర్యం కోసం దశబ్దాలపాటు స్వలాభపేక్ష దేశభక్తితో కొన్ని కోట్లమంది పోరాడిన ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా బ్రతకకలుగుచున్నామని గానుగబండ సర్పంచ్ పంగ వీరాస్వామి అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ అన్నారు. గురువారం గానుగబండ అంగన్వాడీ కేంద్రంలో భారతదేశ స్వాతంత్య్ర వజ్రోస్థవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్బంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించిన ఫలితంగానే దేశం నేడు అన్ని రంగాలలో అగ్రరాజ్యలకు దీటుగా అభివృద్ధి చెందినదని నాటి యోధుల పోరాట గాధలను మనం ఈ సందర్బంగా గుర్తు చేసుకొని వారిని స్మరించుకోవాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంగ వీరాస్వామి,అంగన్వాడీ టీచర్లు పోకల వెంకమ్మ, అమరవరపు సత్యవతి, జంగం అనిత, ఆయాలు గోవిందమ్మ, నాగమణి, సైదమ్మ, బాబు, సోమయ్య, చంద్రయ్య, పూజ, రమణ, బక్కమ్మ, బచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.