నాణ్యత లేని నాసిరకం పనులు. నాణ్యత లోపించిన డ్రైనేజీలు.

కోటగిరి జూన్ 23 జనం సాక్షి:-నాణ్యత లేని నాసిరకం పనులతో,నాణ్యత లోపించిన డ్రైనేజీలు కోటగిరి మండలంలో కొకోల్లలుగా కనిపిస్తున్నాయి.
ఇటీవల కోటగిరి మండల కేంద్రంలోని కోటగల్లి కాలనీలో గత కొన్ని రోజుల క్రితం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ చిన్నపాటి వర్షానికే కూలిపోవడం అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది.ఇట్టి విషయమై ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ.కాంట్రాక్టర్లు,కొందరు ప్రజా ప్రతినిధులు బిల్డర్ల రూపంలో నాసిరకం పనులు చేస్తున్న,ఆ పనులకు సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు.ఎస్.డీ.ఎఫ్ నిధులతో 25 లక్షల వ్యయంతో నిర్మించిన మురుకు నీటి డ్రైనేజీ గురువారం రోజున కొటగల్లి కాలనీలో చిన్నపాటి వర్షానికే డ్రైనేజీ కూలిపోవడం అనేది ఇటు కాంట్రాక్టర్ల పనితనం అటు అధికారుల పర్యవేక్షణ పనితనానికి అద్దంపట్టే విధంగా ఉందని వారు హెగ్దేవ చేశారు. అలాగే ఈ నాసిరకం పనులతో డిస్మెంటల్ అయిన మెటీరియల్ను సంభదిత కాంట్రాక్టర్లు దగ్గరగా ఉండి వారు భూమిలో గుంత చేపించి పుడ్చెస్తున్నారు ఇంకొందరు కాంట్రాక్టర్ల అయితే మిషన్ భగీరథ పథకానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తూ భగీరథ పైపులను డ్రైనేజీల గుండా ప్రజలకు నల్ల కలక్షన్ ఇవ్వడం అనేది ప్రజలు చీదరించుకునే విధంగా ఉందన్నారు.ఇకనైనా ఇలాంటి సంఘటనలు మండలంలో పునరావృతం కాకుండా ఉండాలని అధికారులు,బిల్డర్లను హెచ్చరించారు.అలాగే ప్రజలందరూ మన చుట్టూ జరిగే ఇలాంటి నాసి రకం పనులపై ప్రతి ఒక్కరు చైతన్యవంతంగా వుండి ప్రజాదాయాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరి పైన ముఖ్యంగా నిజాయితీ గల ప్రభుత్వ అధికారులపై ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్,గంగాధర్ దేశాయ్,వాహిద్,ఫత్తే,
అబ్బయ్య,తదితరులు పాల్గొన్నారు.
Attachments area