నాణ్యమైన విద్యను అనదిచడమే ప్రభుత్వ లక్ష్యం
– ర్యాంకర్లకు జ్ఞాపికలు అందజేసిన మంత్రి
జిల్లా బ్యూరో చీఫ్ సంగారెడ్డి, జనం సాక్షి, 22 జులై
సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకర్ల అభినందన కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు జ్ఞాపికలు ప్రదానం చేసిన మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్ శరత్.
అనంతరం జిల్లా పరిషత్ స్కూల్ సైన్స్ మ్యూజియం ప్రారంబించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ
గత ప్రభుత్వాల హయాంలో ఇక్కడ ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు నిల్, ప్రైవేటులో ఫుల్ ఉండేవి. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
స్టేట్ మొదటి ర్యాంకు ఇక్కడ విద్యార్థి సాధించడం. రాష్ట్రంలోని అన్ని కళాశాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుంది. కేసీఆర్ పాలనకు ఈ కాలేజీ ఒక మచ్చు తునక.
ఇక్కడి జిల్లా పరిషత్ స్కూల్ బాగా పని చేస్తుంది. మన ఊరు మన బడి లో భాగంగా ఇంకా బాగా అభివృద్ధి చేస్తాం.
మంచి ఫలితాలు సాధిస్తున్న మీకు అభినందనలు.
వచ్చే ఏడాది మరిన్ని ర్యాంకులు సాధించాలని ఆశభవాన్ని వ్యక్తం చేశారు.