నాబార్డు సహకార సంఘాలకు 10 కోట్ల రుణాలు మంజూరు

వరంగల్‌, జూలై 30 (జనంసాక్షి) : జిల్లాలో సమర్థవంతంగా పని చేస్తోన్న పరస్పర సహాయ సహకార సంస ్థ(ఎంసీిఎసీి)కు 10 కోట్ల నాబార్డ్‌ సహకార సంఘాలకు పది కోట్ల రుణాల కోసం నిధులు మంజూరీ చేస్తున్నట్లు రాష్ట్ర సహకారశాఖా మాత్యులు కాసు వెంకటకృష్ణరెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ సహాకార సంవత్సరాన్ని పురస్కరించుకొని వరంగల్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా సహకార బ్యాంకు చైర్మెన్‌ గంగిరెడ్డి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో సహకార సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహకార మంత్రి మాట్లాడుతూ సహకార సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని అన్నారు. సహకార సంఘాల బలోపే తానికి క్రింది స్థాయి సంఘాల అభిప్రాయాలను సూచనలను తెలుసుకోవడానికి ఈ సద స్సును ఏర్పాటు చేశామని అన్నారు. ఈ విధంగా సహకార సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి సాదించడమే కాకుండా రైతులకు సేవలు అందించి వారి అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సహకార సంఘాలు వ్యాపార ధృక్పథంతో కాకుండా సేవా ధృక్పథంతో పని చేస్తున్నందున వ్యాట్‌ను వీటికి మినహించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నా రు. జిల్లాలో మహిళా సంఘాల పని తీరు మెరుగ్గా ఉందని, 15 ఉత్తమ సంఘాలలో 14 మహిళా సంఘాలే ఉన్నాయని అన్నారు. మహిళా సంఘాలు మరింతగా కృషి చేయాల న్నారు. సహకార సంఘాలను ఇతర రాష్ట్రాల లాగ అన్ని రంగాలకు విస్తరించాలని అన్నా రు. 1904లో సహకార సంఘం వ్యవస్థ పుట్టిందని అన్నారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభు త్వం క్రింది స్థాయిలో ఎన్నికలు జరిపి నప్పుడే సహకార సంఘాలు బలోపేతం అవుతా యని ఆ దశగా కృషి చేసి సహకార సంఘాలను అభివృద్ధి బబాటలో ప్రయణిం చేలా చేశామని అన్నారు. గతేడాది దాదాపు 8,500 కోట్లు రుణాలు సహ కార సంఘాలకు కేటాయిం చామని ఈ ఏడాది 9000 కోట్లు కేటాయిం చగా దీనిని వచ్చే ఏడాది దాదాపు 11 వేల కోట్లుకు పెంచే దశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రైతులకు సహకారం అందించి దళిత పేద వర్గాల మధ్య ఉన్న అంతర్యం తగ్గించడానికి సంఘాలు కృషి చేస్తు న్నామని అన్నారు. యుకెలో లాగా ఫుడ్‌ రిటైల్‌ ఆవుట్‌ లెట్స్‌ను కూడా మహిళా సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. వచ్చే సంవత్సరం 11 నుంచి 12 వేల కోట్లకు చేరే లక్ష్యంగా ముందుకు వెళ్లుతున్నమని ఈ సందర్భంగా అన్నారు. సహకార సంఘాలకు వ్యాట్‌, ట్యాక్స్‌, భూమి వాల్యువేషన్‌ కూడా పెంచుత మన్నారు. మం త్రులు బస్వరాజ్‌ సారయ్య, పోన్నాల లక్ష్మయ్యలు మా ట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌లో లక్ష్యానికి మించి 150 కోట్ల రుణాలను రైతులకు అందించామని తెలిపారు. జిల్లాలో 3.50 లక్షల రైతులు సభ్యుల 91 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయని తెలిపారు. వ్యవసా యానికే పరిమితి కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు పరిమితి సంఘాల ద్వారా రుణ వితరణ చేయాలని సూచించారు.  ఎరువుల పై సబ్సిడీని 30 శాతం నుంచి 50 శాతంకు పెంచినట్లు రాష్ట్ట్ర పభ్రుత్వ ఛీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణ రెడ్డి తెలిపారు. సహకార సంఘాల క్షేత్ర స్థాయి సమస్యలను తెలుసుకొని వాటిని అధిగమించి సంఘాలను పటిష్ఠం చేడానికి కృషి చేస్తున్నాం అన్నారు. ప్రభుత్వం పజ్రల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలకు సహకార సంఘాల ద్వారా రుణాలు అందించలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌ యడవెల్లి విజయేందర్‌ రెడ్డి,  పార్లమెంట్‌ సభ్యులు సిరిసిల్ల రాజయ్య, సహకార మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, సహకార శాఖ కమిషనర్‌, సహకార సంఘాల రిష్రాటర్‌ నరేష్‌, జిల్లా  కలెక్టర్‌ రాహూల్‌ బొజ్జా, అడిషనల్‌ రిష్ట్రార్‌ పి.అర్జున్‌రావు, గురిజాల శ్రీనివాస రావు, వి.చధ్రర్‌ రావు డీసీసీబీ సీఓ ఓ. వి .సురేందర్‌, ఏపీసీఓబి, యండి యంఎస్‌ రామారావు, డిప్యూటి జనరల్‌ మేనేజర్‌ వి.సురేందర్‌, పూల శ్రీనివాసు తదితరులతో డైరెక్టర్‌ జంగా రాఘావ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

తాజావార్తలు