నామినేషన్ల ప్రక్రియ పై పూర్తి అవగాహన తో ఉన్నాం
కేంద్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్
వనపర్తి రిటర్నింగ్ అధికారి ఎస్. తిరుపతి
రావు .
వనపర్తి బ్యూరో అక్టోబర్ 28( జనంసాక్షి)
వనపర్తి జిల్లా
నామినేషన్ల స్వీకరణ, దరఖాస్తుల పరిశీలన పై పూర్తి అవగాహనతో ఉన్నట్లు వనపర్తి రిటర్నింగ్ అధికారి ఎస్. తిరుపతి రావు అన్నారు. శనివారం న్యూ ఢిల్లీ నుండి కేంద్ర ఎన్నికల కమిషన్ నుండి మాస్టర్ ట్రైనర్ లు ఆన్లైన్ ద్వారా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ ల స్వీకరణ, దరఖాస్తుల స్క్రూటినీ, పోలింగ్ రోజు, కౌంటింగ్ రికు తీసుకోవాల్సిన చర్యల పై శిక్షణ , సందేహాల నివృత్తి కార్యక్రమం నిర్వహించగా వనపర్తి జిల్లా నుండి ఎన్. ఐ.సి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. అభ్యర్థులు నామినేషన్ ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్ లైన్ ద్వారా చేసుకుంటారని, వాటిని ఎలా తీసుకోవాలి, పరిశీలన ఎలా చేయాలి, ఎన్నికల నిబంధనల పై అవగాహన కల్పించడమే కాకుండా ఆర్. ఓ లు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వనపర్తి రిటర్నింగ్ అధికారి ఎస్. తిరుపతి రావు మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల స్వీకరణ, అందుకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవడం జరిగిందన్నారు. సందేహాలకు తావు లేకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సర్వ సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు.
ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి జాకీర్ హుస్సేన్, సి సెక్షన్ పర్యవేక్షకులు రమేష్ రెడ్డి, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.