నాలుగున్నరేళ్లలో హావిూలు వెనక్కి పోయాయి

సొంత ఎజెండాతో ముందుకు సాగిన కెసిఆర్‌: కోదండరామ్‌

జనగామ,నవంబర్‌1(జ‌నంసాక్షి): నాలుగున్నరేళ్ల తెరాస పాలనలో సీఎం కేసీఆర్‌ కుటుంబానికే లబ్ది చేకూరిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఇచ్చిన హావిూలు గాలికి పోయాయని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేని కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.

జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాలో ప్రజలకు వాటా ఉండాలన్నారు. ప్రజల బాగోగుల గురించి కేసీఆర్‌ ఆలోచించలేదని విమర్శించారు. కవిూషన్ల కోసం ఆశపడి రూ.40 వేలకోట్లతో అయ్యే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. ఆ రూ.40 వేలకోట్లు బ్జడెట్‌లో మిగిలి ఉంటే రెండు పడక గదుల ఇళ్లు పూర్తయ్యేవన్నారు. కేసీఆర్‌ కంటి, పంటి చికిత్స కోసం దిల్లీ వెళ్లారని.. పేదలు వైద్యం కోసం ఎక్కడికెళ్లాలని ప్రశ్నించారు. కేసీఆర్‌ రాజ్యాంగ వ్యతిరేకిగా మారారని, ఆయన ఇచ్చిన హావిూలు నెరవేరలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఆశించిన విధంగా పాలన సాగడం లేదన్నారు. తెచ్చుకున్న తెలంగాణ ఓ కుటుంబం కోసమా అన్నదే ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఉద్యోగ నియామకాలు మొదలు, నీళ్లునిధుల అన్న డిమాండ్లు పక్కన పోయాయని అన్నారు. అయినా ఏ హావిూలు అమలు చేయకుండానే మళ్లీ ఎన్నికలకు వెళ్లడం వరాఇకే చెల్లిందన్నారు.