నాలుగేళ్లలో ఊహించని అభివృద్ధి: ఎమ్మెల్యే

ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): గడిచిన నాలుగేళ్లలో ఇల్లందు నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి

జరిగిందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. నియోజకవర్గానికి కావాల్సిన నిధులను కోరిన వెంటనే మంత్రి తుమ్మల మంజూరు చేశారని పేర్కొ న్నారు. ఇల్లెందు నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఆరువందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందన్నారు. మంత్రి తుమ్మల ఇల్లెందు నియోజకవర్గానికి ఎప్పుడు నిధులు అడిగినా వెంటనే మంజూరు చేస్తారని , సీఎం కేసీఆర్‌ కూడా వెనుకబడిన ప్రాంతాల పై ప్రత్యేకాభిమానం అన్నారు. తుమ్మల సహకారం, కృషితోనే ఇల్లెందు నియోజకవర్గం రూపురేఖలు మార్చానని, మున్ముందు ఆయన సహాయ, సహకారాలతో అగ్రభాగంలో నిలబెడుతామన్నారు. సీతారామ ప్రాజెక్టు రావడం వెనుక మంత్రి కృషి ఎంతో ఉందన్నారు. చల్లసముద్రం నుంచి లచ్చగూడానికి మూడు కోట్లతో బీటీ రోడ్డుకు ,లచ్చగూడెంలో రెండు కోట్ల రూపాయలతో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు ఇటీవలే శంకస్థాపన చేయడం జరిగిందన్నారు. లచ్చగూడెం గ్రామంలో సీసీరోడ్డు నిర్మాణానికి యాభై లక్షలు, మాణిక్యారం బ్రిడ్జీకి కోటి ఇరవై లక్షలు, కొమరారం నుంచి మసివాగు బీటీకి మూడున్నర కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ముందు తరాలకు పచ్చని చెట్లను బహుమతిగా అందజేయాలని అన్నారు. అత్యంత ఉత్సాహంగా హరితహారం కార్యక్రమం కొనసాగించాలని, అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అన్నారు. అందరిని హరితహారంలో భాగస్వాములు చేయాలని, అందరి భాగస్వామ్యంతోనే హరితహారం విజయవంతం అవుతుందన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ప్రతి పనిని సక్రమంగా చేయాలని, అప్పుడే అనుకున్న లక్ష్యానికి చేరుకుంటామన్నారు.

——

కాంగ్రెస్‌,టిడిపిలవి కుమ్మక్కు రాజకీయాలు : సునీత

యాదాద్రి భువనగిరి,జూలై24(జ‌నంసాక్షి): రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని కాంగ్రెస్‌, టీడీపీ ప్రజాప్రతినిధులు అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్‌, టీడీపీలు కొన ఊపిరిలో ఉన్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ను విమర్శించడంలో అర్థం లేదన్నారు. కాంగ్రె/-,టిడిపి కుమ్మక్కురాజకీయాలకు టిఆర్‌ఎస్‌ ఎందుకు సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరం, ఇతర ప్రాజెక్ట్‌లను ఆపాలని 80 కేసులు కాంగ్రెస్‌ వారు వేశారన్నారు. తెలంగాణ ఎవరి దయదాక్షిణ్యాలతో రాలేదని పోరాడి సాధించుకున్నామన్నారు. మొదటి నుంచి తెలంగాణ పైవిషం కక్కుతున్న ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ద్రోహి, అభివృద్ధి నిరోధకుడన్నారు. హరిత తెలంగాణను సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యులను చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. హరితహారంలో సర్పంచ్‌లు లేనందున అధికారులే క్రియాశీలక పాత్ర పోషించి మొక్కలు నాటాలన్నారు. ఖాళీ స్థలమంటూ లేకుండా మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించుకుని నాటి వాటిని సంరక్షించాలని ఆదేశించారు. చెరువు శిఖం అలుగులు, కాల్వలు, కట్టపైన మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీలైనంత వరకు పర్యావరణానికి

తోడ్పాటు నందించే మొక్కలు నాటాలని సూచించారు. పక్షులకు ఆహారం ఇచ్చే మొక్కలు కూడా విధిగా నాటాలని అన్నారు.

——————–