నాలుగేళ్లలో రూపురేఖలు మార్చా
అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగాను
కూటమి నేతలకు ఓటుతో బుద్ది చెప్పండి
ఓటర్టకు మధుసూధనాచారి పిలుపు
భూపాలపల్లి,నవంబర్24(జనంసాక్షి): నాలుగున్నరేళ్లలోనే భూపాలపల్లి రూపురేఖలు మార్చానని, మరోమారు అధికారంలోకి రాగానే మరింతగా అభివృద్ది చేస్తామని అన్నారు. జిల్లాను ఏర్పాటు చేయడం ద్వారా అభివృదద్‌ఇ చేరువయ్యిందన్నారు. అభివృద్ధి విూ కళ్లముందే కనపడుతోంది.. మహాకూటమి మాయ మాటలు నమ్మి ఆగం కాకండిని ఆయన తన ప్రచారంలో ప్రజలను కోరారు. పనిచేసే వారికి పట్టం కట్టండి.. అంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో ప్రజలు కరంట్ కష్టాలు అనుభవించారని, కానీ తెలంగాణ ప్రభుత్వం 24గంటల కరంట్ ఇస్తూ వారి కష్టాలను కడతేర్చిందని అన్నారు. దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్‌కు జనం నీరాజనం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పచ్చగ కళకళలాడుతున్న తెలంగాణను ఆం ధ్రా నాయకులతో కలిసి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న కూటమిని కూలదోలి బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందని అబద్దాలు అడే సంస్కృతి మాకు లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ప్రాంత రైతాంగం కోసం గణపసముద్రం చెరువును రిజర్వాయర్‌గా తీర్చిదిద్దినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ను గెలలిపించాలని కోరారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే చంద్రబాబును తెలంగాణకు తెస్తున్నారని అలాంటి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రానివ్వకుండా ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ విూద మళ్లీ ఆంధ్రా సీఏం చంద్రబాబునాయుడు పెత్తనం అవసరమా అని నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలన్నారు. చంద్రబాబును బుజాల విూదకు ఎత్తుకుని తీసుకొస్తున్న కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు. అలాటి వారిని చిత్తుగా ఓడించి రాజకీయంగా తరిమికొట్టాలని పిలుపుచ్చారు. సీట్లు పంచుకునే దమ్ములేదు కానీ టీఆర్‌ఎస్ పార్టీని ఓడిస్తారా.. అని ఎద్దెవా చేశారు. 60 ఏండ్లలో జరగని అభివృద్దిని నాలుగేండ్లలో సీఏం కేసీఆర్ చేసి చూపించాడమని అన్నారు.