నాలుగో విడత మిషన్ కాకతీయకు సిద్దం
ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదనలు
ఆదిలాబాద్,మే10(జనం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నాలుగో విడత మొదలయ్యింది.తాజాగా నాలుగో విడతలో భాగంగా చెరువుల పు నరుద్ధరణ కోసం నిధులు మంజూరు చేస్తున్నారు. నాలుగో విడతలో భాగంగా 344 చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 68, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 65, మంచిర్యాల జిల్లాలో 89, ని ర్మల్ జిల్లాలో 122 చెరువులను నాలుగో విడతలో భాగంగా మరమ్మతులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మూడు విడతల్లో భాగంగా చెరువులకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణం కంటే.. ఇప్పటికిప్పుడు చెరువుల తవ్వకమే సులభంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకోగా.. ఎప్పటికప్పుడు పనులపై సవిూక్షలు నిర్వహిస్తుండడంతో.. పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీంతో వేసవి కాలం కావడంతో మిషన్ కాకతీయ చెరువు పనులు ఊపందుకు న్నాయి. రైతులు చెరువుల్లోని మట్టిని తమ పొలాలకు తరలిస్తున్నారు. చాలా గ్రామాల్లో చెరువు పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సాధ్యమైనంత చెరువులను వర్షాలు కురిసే లోపే పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో రైతన్నకు ఎంతో బలాన్ని చేకూర్చగా.. తాజాగా నాలుగో విడత పనులు శరవేగంగా చేపడుతున్నారు. ఈ పనులతో రైతన్నల బీడు భూములు పంట పొలాలుగా మారగా.. తాజాగా నాలుగో విడతలో భాగంగా పనులు కూడా మొదలు పెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 2747చెరువులు ఉండగా.. ఇప్పటికే రూ.467.35కోట్లతో 1279 చెరువులకు మూడు విడతల్లో మరమ్మతులు, పునరుద్ధరణకు అనుమతులిచ్చారు. ఇందులో 971 చెరువు పనులను పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 287 చెరువులకు అంచనాలు తయారు చేసి.. పరిపాలన అనుమతుల కోసం పంపారు. ఇప్పటికే 243 చెరువు ప నులు చేపట్టేందుకు రూ.88.06 కోట్లతో పరిపాలన అనుమతులు కూడా వచ్చాయి. దీంతో 24975 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించనున్నారు. మరోవైపు మిషన్ కాకతీయ-4లో భాగంగా ఉమ్మడి జిల్లాలో 29 కొత్త చెరువుల తవ్వకానికి అనుమతులు ఇచ్చారు. ఈచెరువుల తవ్వకాలకు అవసరమైన భూ ములను కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ అ ధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు భూముల సేకరణపై దృష్టి సారించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా కురియడం, అడవులు ఎక్కువగా ఉండడంతో.. చెరువులే ప్రధాన నీటి వనరుగా మారాయి. దీంతో జిల్లాలో కొత్త చెరువులు తవ్వేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే 41 చెరువులు, మూడు ఆనకట్టల నిర్మాణం చేయాలని నిర్ణయించగా.. ఇప్పటికే 29కొత్త చెరువులకు పరిపాలన అనుమతులు ఇచ్చారు.
————-