నిందితులకు మీడియా ముందు హాజరు పరిచిన పోలీసులు
దేవరుప్పుల,ఆగస్టు 10(జనం సాక్షి):దేవరుప్పుల మండలంలోని కామారెడ్డి గూడెం గ్రామంలో సోమవారం రోజున నాగరాజు అనే వ్యక్తికి హత్య చేసిన సంగతి తెలిసిందే .ఇదే విషమం పై జనగామ జిల్లా డిసిపి సీతారాం, ఏసీపీ సురేష్ , సీఐ విశ్వేశ్వర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కొడకండ్ల మండలం ఏడునుతుల గ్రామానికి చెందిన నాగరాజు కి 20 సంవత్సరాల కింద శైలజ తో వివాహమైంది. నాగరాజు కామారెడ్డి గూడెం అత్తమామలైన అబ్బ సాయిలు ఇంటికి ఇల్లరికం వచ్చాడు. నాగరాజు బాగా తగేవాడని,తాగి వచ్చి రోజు గొడవలు చేసేవాడని గ్రామస్థులు అంటున్నారని పోలీసుల ఎంక్వైరీలో తేలింది.సోమవారం రోజున మామ అబ్బసాయులు,శైలజ,నాగరాజు కొడుకు కిరణ్,అత్త లక్ష్మి పడుకొని ఉన్న సమయంలో నాగరాజు అర్ధరాత్రి 11 గంటలకు బాగా తాగి వచ్చి తమ భార్య అయిన శైలజ కు అన్నం పెట్టమని చెప్పడంతో శైలజ అన్నం పెట్టింది.నాగరాజు బాగా తాగి సోయిలేకుండా అన్నం తినలేని స్థిలో ఉండడంతో నేను అన్నం తినిపిస్తానని చెప్పి భార్య తినిపిస్తుండడంతో చేతి చిటికెడు వేలును నాగరాజు గట్టిగా కొరికేశాడు.వదలమని ఎంత చెప్పినా నాగరాజు ఎంతటి వడలకపోవడంతో శైలజ గట్టిగా అరవడంతో తమ తండ్రి అయిన అబ్బాసాయులు లేచి అల్లుడికి వదలమని ఎంత చెప్తున్న అస్సలు వదలకపోవడంతో ఏమీ తోచలేని సమయంలో మామ కర్రతో నాగరాజు నెత్తిపై గట్టిగా కొట్టాడు .ఆ దెబ్బలకు సోయిలేకుండా నాగరాజు పడిపోవడంతో అప్పటికే నాగరాజు చనిపోయాడని అనుకున్న కుటుంబ సభ్యులు కొను ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాగరాజుకి ఉన్న ప్రాణం కూడా తీసేయాలన్న ఉద్దేశంతో తమ చున్నీతో మెడ చుట్టూ గట్టిగా బిగించి చంపేశారు. ఇలా చంపేసిన నాగరాజును ఎం చెయ్యాలో అర్దం కాక తమ బాత్రూం ఓడలో పెట్టి మట్టితో శవాన్ని కప్పేశారు. నాగరాజు చనిపోయాడు అన్న భయంతో కుటుంబ సభ్యులు అబ్బాసాయూలు కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి తమ బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. భయంతో ఉన్న అబ్బా సాయూలు కుటుంబ సభ్యులు తమ దగ్గరి బంధువులతో జరిగిన విషయం చెప్పారు. ఆ విషయం తెలుసుకున్న ఆ బంధువు దేవరుప్పుల పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వడంతో పాటు ఆ నలుగురు నిందితులు పోలీస్ స్టేషన్లో నిజం ఒప్పుకోవడంతో వాళ్ళను పోలీసులు కస్టడీలో తీసుకున్నారు . బాత్రూం లో పూడ్చిన నాగరాజు శవాన్ని పోలీసులు బయిటికి తీసి పోస్టుమార్టం అనంతరం నిందితులు అబ్బసాయులు, శైలజ, లక్ష్మి , కిరణ్ కి 24 గంటల్లో రిమైండ్ కి పంపిస్తామని డీసీపీ సీతారాం తెలిపారు.ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా డిసిపి సీతారాం, వర్ధన్నపేట ఏసీబీ సురేష్, పాలకుర్తి సీఐ విశ్వేశ్వర్, దేవరుప్పుల ఎస్సై శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.