నిందితులను రక్షిస్తున్న పోలీసులు

దళిత బాధితుల రక్షణ కొరకు జూలై 18న ఛలో లింగంపల్లి.
*లింగపల్లి నుండి మక్తల్ వరకు పాదయాత్ర.*
మక్తల్ జూలై 07 (జనంసాక్షి) మక్తల్ మండలం లింగంపల్లి గ్రామంలో మాదిగలపై ముదిరాజ్ కులం వారు తుమ్మటికూలి హన్మంతు, ఆయన తమ్ముళ్లు మహాదేవ్, నర్సింహ్మ, ఆయన కొడుకు నరేష్, భార్య అంజిలమ్మ, కూతురు రాణిలు దాడి చేశారు. ఆ దాడి కి గురయిన వారిలో నడిమింటి నర్మద, ఆమె భర్త ఆంజనేయులు, అక్కలు లింగమ్మ, సశీలమ్మ, అక్క కూతుళ్ళు సోని, మౌనిక, పూజ లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ దాడి జరిగి నెలరోజులు అవుతున్నా నిందితులను ఇప్పటి వరకు పోలిసులు అరెస్టు చేయలేదు. దళిత బాధితులు SI, CI, DSP లు మొదలుకొని జిల్లా SP ల వరకు అంద‌రినీ కలిసి తమ గోడు వినిపించినప్పటికీ నిందితులను అరెస్ట్ చేయలేదు. పోలీసు అధికారులు బాధితుల రక్షణ కంటే కూడా నిందితులను రక్షించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం లను పట్టించుకోవడంలేదు. దళితులను అసలు పౌరులుగానే గుర్తించడం లేదు. ప్రస్తుతం నిందితులకు పోలీసు అధికారులకు తేడా లేకుండా పోయింది. నేరం-శిక్ష, చట్టం-న్యాయం ఇవన్నీ బాధితులు, బలహీనులు, చేతగానివారు మాట్లాడే భాషగా మారిపోయింది. కులబలం, ధనబలం, అధికారబలం ఉంటే చాలు. వారు ఏమి చేసినా నడుస్తోంది. నేరం చేసినా కూడా వారిని ఎవ్వరూ అడగరు. ఏమి చేయరు. పోలీసు అధికారులు వారికే వత్తాసు పలుకు తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కాబట్టి దళిత బాధితుల గోడు వినిపించడానికి లింగంపల్లి నుండి మక్తల్ తాహశీల్ దార్ కార్యాలయం వరకు జూలై 18న  పాదయాత్ర నిర్వహించి ప్రజల దగ్గరకు వెళ్లుతున్నాము. నిందితుల అరెస్టు కై జరిగే ఉద్యమం లో అందరూ కలిసి రావాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో బండారి లక్ష్మయ్య , కుల నిర్మూలనా పోరాట సమితి కన్వీనర్ జీర్గల్ నాగేష్ MRPS జిల్లా అధ్యక్షులు లింగన్న , KNPS జిల్లా ఉపాధ్యక్షులు గొలాపల్లి జ్ఞాన ప్రకాశ్, MRPS మండల కన్వీనర్ ఎస్. లక్ష్మయ్య , KANPS జిల్లా కన్వీనర్
జె.చక్రవర్తి, KANPS రాష్ట్ర కో కన్వీనర్ ఈరపాగ గోవింద్ తదితరులు పాల్గొన్నారు