నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది నేటి రోజే

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి
– ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ
– కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి నరసింహులు కు ఘన సన్మానం
మక్తల్, సెప్టెంబర్ 17, (జనం సాక్షి న్యూస్)
నేడు సెప్టెంబర్17
నిజాం నిరంకుశ పాలనకు చరమ గీతం పాడుతూ హైదరాబాద్ రాజ్యాన్ని స్వాతంత్రం ప్రకటించినది నేటి రోజేనని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి అన్నారు. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు  హైదరాబాద్ స్వాతంత్ర వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా నేడు మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నారాయణపేట జిల్లా డి సి సి అధ్యక్షులు జాతీయ జెండా ఎగర వేస్తూ తెలంగాణ ఉద్యమ నేతలకు వందనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బి. నర్సింహులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి మాట్లాడుతూ
నిజాం పాలనలో మన ప్రజలు త్రీవంగా అణిచివేతకు, దోపిడికి గురవుతున్న సందర్భంలో భారతదేశం మొత్తం మీదుగా స్వాతంత్ర వేడుకలు నిర్వహించగా కేవలం హైదరాబాద్ రాజ్యం రజాకర్ల చేతుల్లో ఉండిపోయింది. రజకర్ల కబంధ హస్తాల నుండి విముక్తి కలిగించాలన్న ఉద్దేశంతో నాటి ప్రధాని స్వర్గీయ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని హోదాలో మన భారత సైన్యాన్ని మరియు నాటి హోంమంత్రి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిజాం పాలన అంతమొందించి హైదరాబాద్ కు స్వాతంత్రం తీసుకొచ్చిన దినం నేటి దిన మేనని శ్రీహరి అన్నారు. రజకర్ల చేతిలో మన ప్రజలు ఎంతోమంది బలైనారు, హత్యలు బలాత్కారాలు హింసకు ఎంతోమంది చనిపోవడం జరిగింది, చాలామంది హిందువులను ముస్లింలు గా మార్చడం జరిగింది, వీరి ఆగడాలను అరికట్టేందుకు స్వర్గీయ భారతదేశ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి సాహస వంతమైన నిర్ణయాలకు దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగిందన్నారు. ఇట్టి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బి నర్సింలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ,గొల్లపల్లి నారాయణ (ఎస్సీ సెల్ జిల్లా నాయకులు) ఏ. రవికుమార్( పట్టణ అధ్యక్షులు) కట్ట వెంకటేష్, (బీసీ మండల అధ్యక్షుడు) మందుల నరేందర్ (సోషల్ మీడియా ఇన్చార్జ్ )కె .నాగేందర్ ,కె .అంజప్ప, పెద్దింటి మల్లేష్ (ఎస్సీ సెల్ మక్తల్ నియోజకవర్గం నాయకులు )మహమ్మద్ ,నూరుద్దీన్( మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు) , మహమ్మద్ ఫయాజ్ (మైనార్టీ మండల అధ్యక్షుడు) మహమ్మద్ అస్సాముద్దీన్ (మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ )పసుల రంజిత్ కుమార్ రెడ్డి ,మహమ్మద్, బహదూర్ ,కల్లూరి గోవర్ధన్ (యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ )ఆనంద్( మగానూర్ మండలం నాయకులు) పంచలింగాల ఆనంద్ గారు MS  రాజు, రాజేందర్, ఓబులేష్  నాయకులు పాల్గొన్నారు.