నిజాయితీ ఎస్సై ఆత్మహత్య

3

– ఉన్నతాధికారుల వేధింపులే కారణం

– సుసైడ్‌నోట్‌లో మృతుడు రామకృష్ణా రెడ్డి

సిద్ధిపేట,ఆగస్టు 17(జనంసాక్షి): క్రమశిక్షణకు మారుపేరుగా పోలీస్‌శాఖకు మంచిస్థానం ఉంది, అయితే క్రింది స్థాయిలో పనిచేసే అధికారులను వేదింపులకు గురిచేసే ఉన్న తాదికారుల కారణంగా తీవ్రంగా మానసిక క్షోభకు గురవుతున్నవారు కూడా ఈ శాఖలో నిత్యం ఒత్తిడికి గురవుతున్నారు. ఇందుకు చక్కని ఉదాహరణే మెదక్‌ జిల్లా కుకునూర్‌పల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి (45) సర్వీస్‌ రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకున్న సంఘటన. మెదక్‌జిల్లా కుకునూర్‌పల్లిలోని స్టేషన్‌లోఎస్‌ఐగా పనిచేస్తున్న రామకృష్ణారెడ్డిని గత ఆరు నెలలుగా డీఎస్పీ, సిఐలు నిత్యం అవమాన పరచడమేకాక, వేధింపులకు గురిచేస్తున్నారు. ఈవిషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులైన ఎంపికిఇతరుల దృష్టికికూడా తీసుకెల్లారు. అయితే ఉన్నతాదికారి అయి న ఎస్పీకి తెలిపేందుకు అవకాశం చిక్కక పోవడంతో కుమిలిపోతూ కాలం వెల్లదీస్తూ వచ్చారు. వేధింపులు రోజురోజుకు పెరగడంతో బుద వారం ఉదయం 3.30 గంటల సమయంలో తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు అయితే తన ఆత్మహత్యకుగల కారణాలను ఆయన మూడు పేజీల స్యూసైడ్‌ నోట్‌ను కూడా రాసిపెట్టారు. ఎస్‌ఐరామకృష్ణారెడ్డికి భార్య ధనలక్ష్మి ఇద్దరు కుమారులున్నారు. రామకృష్ణారెడ్డి అర్దరాత్రి 12.20గంటలకు భార్య ధనలక్ష్మికి ఫోన్‌చేసి సిఐ, డీఎస్పీల వేధింపుల గురించి ఫోన్‌లో వెల్లడించి బాదపడ్దాడు. ఆయనది నల్గొండ జిల్లా మఠంపల్లి బక్కమంత్రగూడెం. ఆయన గతంలో ఆర్మిలో పనిచేశారు. సైబరాబాద్‌ పరిధిలో పనిచేశారు. జిల్లాలో పనిచేయడం ఇదే తొలిసారి.విధినిర్వహణలో చాలా చురుకుగా వ్యవహరిస్తాడని రామకృష్ణారెడ్డికి మంచి పేరుంది. ప్రతి ఒక్కరితో కలు పుగోలుగా ఉంటాడని ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవారు చెపుతున్నారు. ఆత్మహత్యకుగల కారణాలకు సంబందించిన లేఖను పోలీస్‌ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈవిషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీస్‌ అధికారులు మృతదేహాన్ని గజ్వేల్‌ ప్రబుత్వాసుపత్రి కి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. అయితే ఎస్‌ఐ మరణానికి ముందు ఇద్దరు కానిస్టేబుల్లకు ఫోన్‌చేశారు. ఈవిషయాన్ని కానిస్టేబుల్ల గుర్తు చేసుకుంటూ విూడియాకు తెలిపారు. జాగ్రత్త నేను వెల్తున్నా…. బాయ్‌ అంటూ ఫోన్‌ పెట్టేశాడని కానిస్టేబుల్లు అంటున్నారు. అయితే ఈమాటలను తాము గజ్వేల్‌ ఎస్‌ఐ కమలాకర్‌ సార్‌కు ఫోన్‌ చేసి చెప్పామంటున్నారు. ఈవిషయంతెలుసుకున్న కమలాకర్‌ వెంటనే రామకృష్ణారెడ్డికి ఫోన్‌ చేసి దైర్యం చెప్పేందుకు ప్రయత్నించాడని కానిస్టేబుల్లు చెపుతున్నారు. అయితే అంతటితో ఆగని కమలాకర్‌ వెంటనే తన వాహనం తీసుకుని కుకునూర్‌పల్లికి వచ్చే సరికే వెంకటేశ్వర్‌ రెడ్డి సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని మరణించాడని కానిస్టేబుల్లు అంటున్నారు. ఈవిషయం తెలుసుకున్న భార్య ధనలక్ష్మి కుమారులు, బందువులు హుటాహుటినస్వ గ్రామం నుంచి తరలివచ్చి నెత్తీ నోరు బాదుకుంటూ రోధించడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది.  ఈసందర్బంగా ధనలక్ష్మి విూడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల వేదింపులపై డీఐజికి, డీజీపికి చెప్తామని చెప్పినా కూడా భర్త వెనక్కి తగ్గేవాడని చెప్పింది. క్రమశిక్షణగల అధికారిగా ఉం టున్న తాను మచ్చ తెచ్చుకోలేనని అంటుండే వాడన్నారు. రాత్రి 12.20 గంటలకు ఫోన్‌చేసి కూడా డీఎస్పీ, సిఐల వేదింపులపై చెప్పాడని అయినా మనో ధైర్యంతో ఉండాలని, సెలవు పెట్టి ఇంటికి రమ్మని చెప్పానని రోధిస్తూ తెలిపింది. అయితే తెల్లారే సరికే ఆత్మహత్యకు పా ల్పడతా డని ఊహించలేదన్నారు. తన భర్త మరణానికి కారణమైన సిఐ, డీఎస్పీలను చట్ట పరంగా చర్య తీసుకోవాలని అరెస్ట్‌ చేసి క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ధనలక్ష్మి రోధిస్తూ ఉన్నతాదఇకారులను వేడుకుంది.  ఏదిఏమైనా పోలీస్‌శాఖలో ఉన్నతాధికారుల వేదింపులు ఇంకా ఇంకా కొనసాగుతున్నాయని చెప్పడానికి రామకృష్ణారెడ్డి ఆత్మహత్య  ఉదాహరణ.

స్వగ్రామంలో విషాద చాయలు

ఇదిలా ఉండగా ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి స్వగ్రామమైన బక్కమంత్రగూడెంలో ఈవార్త తీవ్ర విషాదాన్ని నింపింది.రామకృష్ణారెడ్డి పుష్కరాలకు వస్తానని చెప్పాడని అయితే ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం తాము నమ్మడంలేదని, ఈసంఘటనను జీర్ణించుకోలేకపోతున్నా మని బందువులు, స్నేహితులు వాపోతున్నారు. అయితే రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటున్నారు. ఉన్న తాదికారుల వేదింపులవల్లే ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రమస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

రామకృష్ణారెడ్డి బంధువుల ఆందోళన

మెదక్‌ జిల్లా  కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌ ఎస్సై రామకృష్ణారెడ్డి(45) ఆత్మహత్యకు పాల్పడడంతో బంధువుల ఆందోళనకు దిగారు. దీనికి కారణమైన డిఎస్పీ,సిఐలపై చర్య తీసుకోవాలని రాస్తారోకో చేశారు. గ్రామస్తులు కూడా దీనికి మద్దతు తెలపడంతో రాజీవ్‌ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దాదాపు మూడుకిలోమేటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిఎం నియోజకవర్గం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని కంట్రోల్‌ చేసారు. రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ, సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌ తన చావుకు కారణమంటూ రామకృష్ణారెడ్డి సూసైడ్‌ నోట్‌ రాసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకునే ముందు గజ్వేల్‌ ఎస్‌ఐ కమలాకర్‌, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు ఫోన్‌ చేసి తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పినట్లు సమాచారం. పోలీస్‌ క్వార్టర్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులు లేని సమయంలో సర్వీస్‌ రివాల్వర్‌తో కణత వద్ద కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రామకృష్ణారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన స్వస్థలం మఠంపల్లి మండలం బక్కమంత్రగూడెం. 1996లో ఎస్‌ఎస్‌సీ పూర్తి కాగానే రామకృష్ణారెడ్డి పదేళ్లపాటు ఆర్మీలో పనిచేశారు. ఆ సమయంలో కాలికి బుల్లెట్‌ గాయం కావడంతో ఆర్మీ నుంచి వైదొలిగారు. అనంతరం 2006-07లో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. గతంలో హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజారు, లక్డీకపూల్‌ పోలీస్‌స్టేషన్లలో ఎస్‌ఐగా పని చేశారు. ఇటీవల మల్లన్నసాగర్‌ ముంపు బాధితుల ఆందోళనలో రామకృష్ణారెడ్డి కాలికి గాయమైంది. ఆర్మీలో ఉన్నప్పుడు గాయమైన కాలికే మళ్లీ గాయమైంది.